×
Ad

మరో ఘోర రోడ్డు ప్రమాదం.. 7 బస్సులు దగ్ధం.. నలుగురి మృతి.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

పలు కార్లను వెనుక నుంచి ఏడు బస్సులు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభించింది.

Mathura: మరో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మథురలో మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై పలు బస్సుల్లో మంటలు చెలరేగాయి. పలు కార్లను వెనుక నుంచి ఏడు బస్సులు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభించింది. నలుగురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

ఉత్తరప్రదేశ్‌లోని పలు నగరాల్లో ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. ఈ ప్రమాదానికి పొగమంచు కారణమని తెలుస్తోంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది 11 ఫైరింజన్లతో అక్కడకు చేరుకుని మంటలు ఆర్పారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.