ఓట‌మి భ‌య‌మా అంటే? : శరద్ పవార్ షాకింగ్ డిసిషన్

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.

  • Publish Date - March 11, 2019 / 11:11 AM IST

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు.

నేషనల్ కాంగ్రెస్ పార్టీ (NCP)అధినేత, కేంద్రమంత్రి శరద్ పవార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని ప్రకటించారు. మహారాష్ట్రలో సోమవారం (మార్చి 11, 2019) మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయకూడాదని నిర్ణయించుకున్నానని, పార్టీ నేతలకు షాక్ ఇచ్చారు. తాను పోటీ చేయకపోయినప్పటికీ, తన కుటుంబం నుంచి కుమార్తె సుప్రియ సులే, మనమడు పార్థ్ పవార్ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్టు తెలిపారు. మహారాష్ట్రలో జరుగబోయే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్ సీపీ కలిసి పోటీ చేయబోతున్నట్టు వార్తలు వచ్చిన తరుణంలో శరద్ పవార్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
Read Also : ‘సివిజిల్’ యాప్ :ఎల‌క్ష‌న్ కంప్ల‌యింట్స్ ఎవ‌రైనా చేయొచ్చు

మాధ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓడిపోతాననే భయంతోనే ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అని అడిగిన ప్రశ్నకు పవార్ సమాధానమిచ్చారు. ‘ఇప్పటివరకూ నేను 14 ఎన్నికల్లో విజయవంతంగా పోటీ చేశాను. 14 ఎన్నికల్లో పోటీచేసినవాడిని.. 15వ సారి ఎన్నికల్లో పోటీ చేయలేననా మీ అనుమానం?’ అని సూటిగా ప్రశ్నించారు. 2014 నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న శరద్ పవార్.. లోక్ సభ స్థానం నుంచి ఏడు సార్లు ఎన్నికయ్యారు.

ఇందులో ఆరు సార్లు తన సొంత నియోజవర్గం పుణెలోని బరమటి నుంచే గెలిచారు. 2008లో డిలిమిటేషన్ సీట్లలో భాగంగా మాధ నియోజవర్గాన్ని సృష్టించగా.. 2009లో పవార్ మాధను తన నియోజవర్గంగా ఎంచుకున్నారు. 2014లో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని భావించిన పవార్.. పార్లమెంట్ లోని రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.
Read Also : ఆ సర్వేలో చెప్పిన జనం : మళ్లీ మోడీనే ప్రధాని కావాలి

మహారాష్ట్రలో మొత్తం 8కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచి 48 మంది ఎంపీలు లోక్ సభకు ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి లోకసభ స్థానాలకు అత్యధికంగా 80 సీట్లు ఉండగా.. యూపీ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. 2014లో మహారాష్ట్రలో కాంగ్రెస్ 26, ఎన్ సీపీ 21 సీట్లు పంచుకుని కలిసి బరిలో నిలిచాయి.

బీజేపీ గాలి గట్టిగా వీయడంతో రెండు పార్టీలు రెండు నుంచి నాలుగు స్థానాలను మాత్రమే గెలుచుకున్నాయి. బీజేపీ 23 స్థానాలను గెలుచుకుంటే.. శివసేన పార్టీ 18 స్థానాలను సొంతం చేసుకుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో కూడా శివసేన, బీజేపీ కూటమికే విజయం వరించింది. బీజేపీ, శివసేన పార్టీల మధ్య అంతర్గతంగా విభేదాలు ఉన్నప్పటికీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 25, 23 స్థానాలకు కలిసే పోటీ చేసేందుకు ఇప్పటికే కూటమిని ఖరారు చేశాయి. 
Read Also : నోరు విప్పిన RBI : నోట్ల రద్దు వద్దంటే.. ప్రజా శ్రేయస్సు అన్నారు