Sharad Pawar: ఎంవీఏ ప్రభుత్వం అందుకే పడిపోయింది..! తన ఆత్మకథలో ఉద్ధవ్‌‌ ఠాక్రే‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవార్

మహారాష్ట్రలో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ కలిసి కుట్ర పన్నాయని శరద్ పవార్ తన ఆత్మకథ‌లో ప్రస్తావించారు.

Sharad Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో కీలక వ్యక్తిగాఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షులు శరద్ పవార్ (82)  అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మంగళవారం తన ఆత్మకథ ‘లోక్ మాజే సంగటి’ (ప్రజలు నాకు తోడుగా ఉంటారు) మరాఠీ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ సంచలన నిర్ణయాన్ని పవార్ ప్రకటించారు. అయితే, ఎన్సీపీ శ్రేణులు మాత్రం అందుకు ససేమీరా అంటున్నారు. శరద్ పవార్ అధ్యక్ష పదవిలో కొనసాగాలని డిమాండ్ చేస్తున్నారు. పవార్ మాత్రం తన రాజీనామా ప్రకటనకే కట్టుబడి ఉన్నారు. అయితే, తన ఆత్మకథ ‘లోక్ మాజే సంగటి’ రెండో భాగంలో ఉద్దవ్ ఠాక్రే పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రంలో ఎంవీఏ (మహా వికాస్ అఘాడి) సంకీర్ణ ప్రభుత్వం పడిపోవటానికి ఉద్దవ్ ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.

Sharad Pawar: ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా..! అజిత్ పవార్ నిర్ణయమే కారణమా?

మహారాష్ట్రంలో ఉద్దవ్ ముఖ్యమంత్రిగా ఉన్న ‘మహా వికాస్ అఘాడి’ సంకీర్ణ ప్రభుత్వాన్ని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం, రాజ్ భవన్ కలిసి కుట్ర పన్నాయని శరద్ పవార్ తన ఆత్మకథలో ప్రస్తావించారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తరువాత శివసేనలో తిరుగుబాటు జరుగుతుందని, ఆ తర్వాత శివసేన తన నాయకత్వాన్ని కోల్పోతుందని మాకు తెలియదు. అయితే, ఉద్దవ్ మాత్రం ఎటువంటి పోరాటం లేకుండానే రాజీనామా చేశారు. ఫలితంగా ఎంవీఏ ప్రభుత్వం పడిపోవటానికి ప్రధాన కారణమైందని పవార్ పేర్కొన్నారు. ఉద్దవ్ తో మాట్లాడుతున్నప్పుడు నాకు సౌకర్యంగా అనిపించలేదు. బాలాసాహెబ్ ఠాక్రేతో చర్చలు జరిపిన సమయంలో ఎంత సౌకర్యంగా ఉన్నానో, ఉద్దవ్ తో చర్చల సమయంలో అంతసౌకర్యంగా ఉండలేకపోయాయని పవార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన కొంతకాలంకు ఉద్దవ్ అనారోగ్యం కారణంగా ప్రభుత్వంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని శరద్ పవార్ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

Sharad Pawar: ఎన్సీపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా విషయంలో శరద్ పవార్ యూటర్న్?.. అజిత్ పవార్ ఏమన్నారు?

అయితే, బీజేపీ, శివసేన మధ్య దూరం పెరగడం శుభసూచకమని శరద్ పవార్ తన ఆత్మకథ పుస్తకంలో పేర్కొన్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనేక ఎత్తులు వేశారు. అయితే, వాటిని మేము సరిగ్గా ఎదుర్కోలేక పోయాం. శివసేనలోనే ప్రధాన చీలికరావడం, అందులోనూ ఉద్దవ్ ఎలాంటి పోరాటం లేకుండా చేతులెత్తేయడం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి ప్రధాన కారణమైందని శరద్ పవార్ తన పుస్తకంలో చెప్పారు.

Maharashtra Politics: 27 ఏళ్లకు ఎమ్మెల్యే, 38 ఏళ్లకే సీఎం.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శరద్ పవార్ రాజకీయ జర్నీ ఎలా సాగిందంటే?

2019 ఎన్నికల తరువాత మహారాష్ట్రలో అప్పటి శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఆధ్వర్యంలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఏకమై మహారాష్ట్ర వికాస్ అఘాడి (ఎంవీఏ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర 19వ సీఎంగా 2019 నవంబర్ 28న అప్పటి శివసేన అధినేత ఉద్దశ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. అనేక అవాంతరాల మధ్య పాలన కొనసాగింది. శివసేన వర్గవిబేధాలు తారాస్థాయికి చేరడంతో పాటు ఆ పార్టీ సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే తనకు అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి పార్టీని వీడి బీజేపీతో చేతులు కలిపారు. దీంతో ఎంవీఏ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య 2022 జూన్ 29న అవిశ్వాస తీర్మానానికి ముందు ఉద్దశ్ ఠాక్రే సీఎం పదవికి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తరువాత జూన్ 30న ఏక్‌నాథ్ షిండే బీజేపీలో చేరి మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టిన విషయం విధితమే.

ట్రెండింగ్ వార్తలు