Prashant Kishore : ప్రశాంత్‌కిషోర్ తో మరోసారి భేటీ అయిన శరద్‌పవార్

ఎన్సీపీచీఫ్ శరద్‍‌పవార్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.

Sharad Pawar,prashant Kishore Meet

Prashant Kishore : ఎన్సీపీచీఫ్ శరద్‍‌పవార్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ని గద్దెదించటానికి వీరిద్దరూ చేతులు కలుపుతున్నట్లు ఊహాగానాలు ఊపందుకున్నాయి.

వీరిద్దరూ జూన్ 12న ముంబైలోని పవార్ నివాసంలో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో మూడు గంటలకుపైగా తాజారాజకీయ పరిస్ధితులపై చర్చించినట్లు తెలిసింది. తాజాగా ఈ రోజు జరిగిన భేటీలో పవార్, ప్రశాంత్ కిషోర్ లతో పాటు మహారాష్ట్ర ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్, పార్టీ ఎమ్మెల్యే, పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ కూడా పాల్గొన్నారు. కాగా పార్టీ సీనియర్ నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఈ సమావేశం సుమారు అరగంటపైగా సాగింది.2024 ఎన్నికల్లో బీజేపీని గద్దె దించటానికి వీరిద్దరూ ప్రతిపక్ష ఉమ్మడి ప్రధాని అభ్యర్ధి ఎంపికపై మాట్లాడినట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ హావాకు అడ్డుకట్ట వేసి మమతా బెనర్జీ అధికారం చేజిక్కుంచకోటానికి అనుసరించిన వ్యూహాలు, పరిస్ధితులపై వారిద్దరూ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ గెలుపు అంశం పై కూడా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

పశ్చిమబెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ మమతా బెనర్జీ, స్టాలిన్ లకు రాజకీయ వ్యూహకర్తగా కీలక పాత్ర పోషించి వారిని గద్దెనెక్కించారు. బెంగాల్ ఎన్నికల అనంతరంశరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే చొరవతో ప్రశాంత్ కిషోర్ పవార్ తో భేటీ అయ్యారు.