Site icon 10TV Telugu

Gold Smuggling: షార్జా టూ భారత్ గోల్డ్ స్మగ్లింగ్.. విమానాశ్రయంలో బంగారు పెట్టె!

Gold Smuggling

Gold Smuggling

Gold Smuggling: ఒకవైపు అధికారులు, పోలీసులు నిఘా పెట్టి విమానాశ్రయాలలోనే విస్తృత తనిఖీలు నిర్వహించి ఇతర దేశాల నుండి వచ్చే అక్రమ బంగారాన్ని సీజ్ చేస్తున్నా.. కేటుగాళ్లు రకరకాల కొత్త మార్గాల ద్వారా బంగారాన్ని ఇండియాలో దించేస్తున్నారు. నిత్యం మన దేశంలో ఏదో ఒక విమానాశ్రయంలో బంగారం పట్టుబడుతున్నా.. అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా షార్జా నుండి ఇండియాకి తీసుకొచ్చిన బంగారు పెట్టె అధికారులకు చిక్కింది.

Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్

రాజస్థాన్​లోని జైపుర్​ విమానాశ్రయంలో అధికారులు నాలుగు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి భారత్​కు బంగారాన్ని అక్రమ రవాణా చేయనున్నట్లు పక్కా సమాచారంతో అధికారులు ఎయిర్​పోర్ట్​లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఎయిర్​పోర్ట్​లో అనుమానాస్పదంగా భావించిన లగేజీలను తనిఖీ ​ చేయగా ఒకదాంట్లో గోల్డెన్​ ఐరన్​ బాక్స్​ దొరికింది.

Gold Smuggling : పద్మావతి ట్రావెల్స్‌లో మూడేళ్లుగా సాగుతున్న గోల్డ్ స్మగ్లింగ్!

బంగారాన్ని ఐరన్ ​బాక్స్​ రూపంలోకి మార్చి మన దేశానికి తీసుకొచ్చిన దీని విలువ విలువ రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగగా.. లగేజీ తెచ్చిన ప్రయాణికుడి కోసం గాలిస్తున్నామని డైరెక్టరేట్​ ఆఫ్​ రెవెన్యూ ఇంటఎలిజెన్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసిన అధికారులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో అధికారుల తనిఖీల్లో రూ.55 లక్షలు విలువ చేసే కిలో బంగారాన్ని స్వాధీనం గుర్తించారు.

Exit mobile version