Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్

బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు  కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము. 

Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్

Kolkata Gold Smuggling

Updated On : April 4, 2022 / 5:17 PM IST

Gold Smuggling :  బంగారం స్మగ్లింగ్ చేసే వారిపై పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడులు పెరిగిపోవటంతో అక్రమార్కులు  కొత్తపద్దతులు ఎన్నుకుంటున్న అనేక ఘటనలు మనం చూస్తున్నాము.   తాజాగా   సిలిగురిలో అండర్ వేర్‌లో  బంగారం బిస్కట్లు దాచి రవాణా చేస్తున్న వ్యక్తిని శనివారం అరెస్ట్ చేశారు.

పశ్చిమ బెంగాల్ లోని మాల్దానుంచి సిలిగురికి బస్సులో వెళుతున్న   ఒకవ్యక్తిని   ఉత్తర బెంగాల్ యూనివర్సిటీ  వద్ద   డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ  ఇంటిలిజెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక్కోక్కటి 16 గ్రాముల బరువున్న 20 బంగారం బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు వీటిని తన అండర్ వేర్ లో దాచుకుని అక్రమంగా రవాణా చేస్తున్నాడు.
Also Read : Chandrababu Naidu : కల్తీ మద్యం, జే-ట్యాక్స్ పై పోరాటం సాగించాలి
డీఆర్ఐ అధికారులకు అందిన విశ్వసనీయ సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. వీటి విలువ సుమారు రూ.  1,71,87,640 గా ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని సిలిగురి కోర్టులో హాజరు పరిచారు. కేసు నమోదు చేసి డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.