Shashi Tharoor
Kerala :కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓటమి పాలైన సీనియర్ నేత శశి థరూర్.. సొంత రాష్ట్రమైన కేరళకు కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షంలో ఉన్న పార్టీ.. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే, థరూర్నే ముఖ్యమంత్రి చేస్తారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై థరూర్ క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం ఏం ఆలోచిస్తుందనేది ఆయన చెప్పలేదు కానీ, తాను మాత్రం ఆ పదవికి సిద్ధంగా లేనట్లు మాత్రం ప్రకటించారు. ఇన్నేళ్ల రాజకీయంలో తాను ఏం చేశానో, ఇప్పుడు అదే చేస్తానని చెప్పారు. అంటే జాతీయ రాజకీయాల్లో ఉంటూ కేంద్ర మంత్రిగా పని చేసిన ఆయన.. ఇకపై కూడా కేంద్ర రాజకీయాల్లోనే కాలు కదపనున్నట్లు స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితం మలయాళం న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. రైలులో విమాన ప్రయాణం అనుభూతి