Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు.(Vande Bharat Express)

Vande Bharat Express : వారెవ్వా వందే భారత్.. అదిరిపోయే ఫీచర్లు, రైలులో విమాన ప్రయాణం అనుభూతి

Vande Bharat Express : అదిరిఫోయే ఫీచర్లు, అత్యాధునిక టెక్నాలజీ, అత్యంత వేగం, ఆహా అనిపించే ఏర్పాట్లు, సౌకర్యవంతమైన ప్రయాణం.. ఇదీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేకతలు. నిజానికి ఇది రైలే.. కానీ.. ఇందులో ప్రయాణం మాత్రం.. విమానంలో ప్రయాణించిన అనుభూతిని కలిగిస్తుంది. అదే వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్పెషాలిటీ అంటున్నారు అధికారులు.

తెలుగు రాష్ట్రాల మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తుంది. పండుగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు గొప్ప కానుక అని ప్రధాని మోదీ అన్నారు. తెలుగు ప్రజలకు వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుందన్నారు.

Also Read..Vande Bharat Express : జస్ట్ 8.40 గంటలే.. 3రోజుల్లో సికింద్రాబాద్-వైజాగ్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పరుగులు

హైదరాబాద్-వరంగల్-విజయవాడ-విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుందని, దీంతో సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందన్నారు. పూర్తిగా దేశీయంగా తయారైన వందే భారత్ తో బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. మారుతున్న దేశ భవిష్యత్తుకి ఇదొక ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు.

అత్యంత వేగంగా గమ్య స్థానాలకు చేరుస్తుంది.
భద్రతతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది.
2023లో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు ఇది.(Vande Bharat Express)

ఇవాళ ఒక్కరోజు మాత్రమే వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రత్యేక వేళల్లో నడుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరి చర్లపల్లి, భువనగిరి, జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, కొండపల్లి, విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారంపూడి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది. రాత్రి 8గంటల 45 నిమిషాలకు విశాఖ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. సోమవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఆదివారం మినహా వారంలో 6 రోజుల పాటు ఈ రైలు సేవలు అందిస్తుంది.

Also Read..Vande Bharat Express: మోదీ ప్రారంభించిన వందేభారత్-3 రైలు విశేషాలు ఏంటో తెలుసా?

వందే భారత్ రైలు ప్రత్యేకతలు..
* ఈ రైలు బయటి రూపు ఏరో డైనమిక్ డిజైన్ తో రూపొందించారు.
* గరిష్టంగా 180 కిమీ వేగాన్ని అందుకునేలా డిజైన్ చేశారు.
* ఈ వేగాన్ని ప్రయోగదశలో మాత్రమే పరీక్షించి చూశారు.
* ప్రస్తుతం నిర్వహణ దశలో గరిష్ట వేగం పరిమితి మాత్రం గంటకు 160 కిమీ మాత్రమే ఉంది.
* ఈ గరిష్ట వేగాన్ని 140 సెకన్లలో అందుకుంటుంది.
* ఫుల్లీ సస్పెండెడ్ ట్రాన్సాక్షన్ మోటార్ తో రూపొందించిన ఆధునిక బోగీలు.
* రైలు ఎంత వేగంతో వెళ్లినా కుదుపులు ఉండవు.(Vande Bharat Express)
* ఈ రైలుకి ప్రత్యేకంగా లోకో మోటివ్ ను జత చేయాల్సిన అవసరం లేదు.
* రైలులో అంతర్భాగంగానే ఇంజిన్ ఉంటుంది.
* ఎంఎంటీఎస్ రైలు తరహాలో లోకో పైలెట్ క్యాబిన్ లో రెండు చివర్ల ఉంటాయి.
* ఇందులో సీట్ల ప్రత్యేకత వేరు.
* 180 డిగ్రీల కోణంలో సీట్లు తిప్పుకోవచ్చు.
* కిటీకి నుంచి బయటకు చూడాలని అనుకున్నప్పుడు సీటు కిటికీ వైపు తిప్పుకోవచ్చు.
* కుటుంబసభ్యులు రెండు సీట్లను పరస్పరం ఎదురెదురుగా తిప్పుకుని కూర్చోవచ్చు.
* కోచ్ లో 32 అంగుళాల డిజిటల్ స్క్రీన్ ఉంటుంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

* అందులో ప్రయాణికులకు రైలు వేగంతో సహా అన్ని వివరాలు డిస్ ప్లే అవుతుంటాయి.
* ఆడియో అలర్ట్ కూడా ఉంటుంది.
* ఆటోమేటిక్ తలుపులు ఉంటాయి. వాటి నియంత్రణ లోకో పైలెట్ వద్దే ఉంటుంది.
* మధ్యలో ప్రయాణికులు వాటిని తెరవలేరు, మూయలేరు.
* ఇలా రైలు ఆగిన కొన్ని క్షణాల్లోనే డోర్లు తెరుచుకుంటాయి.
* బయలుదేరడానికి కొన్ని సెకన్ల ముందు డోర్లు మూసుకుంటాయి.
* లోపలి వైపు, బయటి వైపు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి.
* లోపల వైఫై వసతి ఉంటుంది.
* రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చినప్పుడు పరస్పరం ఢీకొట్టుకోకుండా కవచ్ పరిజ్ఞానాన్ని కల్పించారు.
* ప్రతీ కోచ్ లో 4 ఎమర్జెన్సీ లైట్లు.(Vande Bharat Express)
* విద్యుత్ సరఫరాలో అవాంతరాలు ఏర్పడినప్పుడు వెలిగే విధంగా లైట్ల డిజైన్.
* ఈ రైల్లో ప్రస్తుతానికి చైర్ కార్ మాత్రమే ఉంటుంది.
* సాధారణ రైళ్లలాగా స్లీపర్ బెర్తులు ఉండవు.
* అందువల్ల వీలైనంత దగ్గర స్టేషన్ల మధ్యలోనే తిరుగుతాయి.
* రాత్రి వేళ ప్రయాణం లేదు.
* సాధారణంగా దూర ప్రాంతాల మధ్య రాత్రి వేళ ప్రయాణాన్నే జనం కోరుకుంటారు.
* నిద్ర సమయంలో ప్రయాణాన్ని ముగించడం ద్వారా పగటి పూట పనులు చూసుకోవచ్చని భావిస్తారు.
* కానీ, వందే భారత్ రైలు పగటి వేళ మాత్రమే ప్రయాణించాల్సి రావడం ఓ ప్రతికూల అంశం.
* దీంతో తదుపరి రైల్లో బెర్తులు ప్రవేశపెట్టే యోచనలో రైల్వే అధికారులు.
* వందే భారత్ రైల్లో మొత్తం 16 బోగీలు.(Vande Bharat Express)
* ఇందులో 14 ఏసీ చైర్ కార్లు, 2 బోగీలు ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లు.
* ఎగ్జిక్యూటివ్ ఏసీ చైర్ కోచ్ లో 104 సీట్లు.
* ఎకానమీ క్లాస్ లో 1024 సీట్లు.
* మొత్తంగా ఈ రైల్లో ఒకేసారి 1128 మంది ప్రయాణం చేయొచ్చు.