Shatrughan Sinha Twitter: శత్రుఘ్న సిన్హా ట్విట్టర్ అకౌంట్‌కు ఎలన్ మస్క్ పేరు

కాంగ్రెస్ లీడర్, యాక్టర్ అయిన శత్రుఘ్న సింహా ట్విట్టర్ అకౌంట్ పేరు మారింది. ఆయన అధికారిక అకౌంట్ ను హ్యాకింగ్ చేసిన సైబర్ క్రిమినల్స్..

Shatrughan Sinha Twitter: శత్రుఘ్న సిన్హా ట్విట్టర్ అకౌంట్‌కు ఎలన్ మస్క్ పేరు

Strugna Sinha

Updated On : August 21, 2021 / 5:15 PM IST

Shatrughan Sinha Twitter: కాంగ్రెస్ లీడర్, యాక్టర్ అయిన శత్రుఘ్న సింహా ట్విట్టర్ అకౌంట్ పేరు మారింది. ఆయన అధికారిక అకౌంట్ ను హ్యాకింగ్ చేసిన సైబర్ క్రిమినల్స్ పేరును ఎలన్ మస్క్ గా మార్చడమే కాకుండా ప్రొఫైల్ ఫొటో స్థానంలో రాకెట్ లాంచ్ పిక్చర్ ను ఉంచారు. హ్యాకింగ్ చేసినప్పటికీ పాస్ వర్డ్ మార్చకుండా అలానే ఉంచారు. రీసెంట్ గా తన కొలీగ్ శశి థరూర్ ప్రొఫైల్ లో మార్పులు గమనించలేకపోయారంటూ ట్వీట్ చేశారు.

సిన్హా.. పోస్టు చేయడానికి రెండు గంటల ముందు.. ‘గౌరవనీయులు, ఆమోదయోగ్యులు, సమర్థులైన పొలిటీషియన్స్ శశిథరూర్, మహువా మొయిత్రాల మధ్య అద్భుతమైన చర్చ జరిగింది’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ హ్యాకింగ్ తర్వాత సిన్హా.. తన అకౌంట్ ను తానే హ్యాండిల్ చేస్తున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఏప్రిల్ 2019లో బీజేపీకి గుడ్ బై చెప్పిన సిన్హా కాంగ్రెస్ లో చేరారు. ఆ తర్వాత జీఎస్టీ అమలు, డీమోనిటైజేషన్ వంటి అంశాలపై పలు మార్లు బీజేపీని విమర్శించారు.

ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ విషయాలు ఇటీవలి కాలంలో ఎక్కువగానే జరుగుతున్నాయి. జులై నెలారంభంలో బీజేపీ లీడర్ ఖుష్బూ సుందర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. అదే నెలలో లోక్ సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇతెహదుల్ ముస్లిమీన్ ట్విట్టర్ హ్యాకింగ్ కు గురైంది.

గత సంవత్సరం సెప్టెంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ అకౌంట్ లో కూడా మార్పులు జరిగాయి. @narendramodi_in అనే పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి కొందరి అకౌంట్లకు బిట్ కాయిన్ డొనేట్ చేయండంటూ పోస్టులు పెట్టారు.