Sheena Bora Alive
Sheena Bora Murder Mystery : తన కూతురు షీనా బోరా బతికే ఉందని సీబీఐకి మీడియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంద్రాణి ముఖర్జియా సంచలన లేఖ రాశారు. 2012 సంవత్సరంలో కుమార్తె షీనా బోరాను హత్య చేసినట్లుగా ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తోబుట్టువుగా పిలిచే షీనా బోరాను గొంతు కోసి చంపిందని శ్యాంవర్ రాయ్ ముంబై పోలీసులకు వెల్లడించారు. ప్రస్తుతం ఈ లేఖ సంచలనం సృష్టిస్తోంది. షీనా బోరా కోసం వెతకాలని తాను కోరుతున్నట్లు లేఖలో వెల్లడించారు.
Read More : Girl Murder : ఏడేళ్ల బాలిక కిడ్నాప్..నోటిలో రాళ్లు వేసి హత్య..నిందితుడి ఆచూకీ చెబితే రూ.50 వేలు బహుమతి
లేఖతో పాటు ఆమె సీబీఐ కోర్టుకు ఒక దరఖాస్తు కూడా పంపారు. కశ్మీర్ లో షీనా బోరాను తాను కలవడం జరిగిందని..ఇటీవలే జైలులో ఉన్న ఓ మహిళ తనకు చెప్పడం జరిగిందన్నారు. ఈమె చేసిన దరఖాస్తుపై సీబీఐ త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇంద్రాణి డ్రైవర్ శ్యాంవర్ రాయ్ తుపాకీతో దొరకడంతో షీనా బోరా హత్య కేసు వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ను పోలీసులు విచారించగా..హత్యను ప్రత్యక్షంగా చూడడం జరిగిందన్నారు. దీంతో 2015లో ఇంద్రాణిని అరెస్టు చేసి బైకులా జైలుకు తరలించారు.
Read More : Milind Naik : లైంగిక ఆరోపణలు.. మంత్రి పదవి ఊడింది
ముంబైలోని బాంద్రాలో హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని రాయ్ గడ్ వరకు తీసుకెళ్లిందని పోలీసులు ఆరోపించారు. షీనా అవశేషాలు దొరికాయని దర్యాప్తు సంస్థలు కూడా వెల్లడించాయి. ఇంద్రాణి అరెస్టు అనంతరం ఆమె మాజీ భర్త…సంజీవ్ ఖన్నా కూడా హత్య..సాక్ష్యాలను తొలగించడంలో ఆమెకు సహాయం చేశాడనే ఆరోపణలపై అరెస్టు చేశారు. అవశేషాలు దొరకడంపై వచ్చిన వాదనలను ఇంద్రాణి కొట్టిపారేస్తున్నారు. విచారణ సమయంలో పీటర్, ఇంద్రాణిలు విడాకులు తీసుకున్నారు. మరి..ఇంద్రాణి రాసిన లేఖపై సీబీఐ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.