Sivendhu
పశ్చిమ బెంగాల్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి బిజెపి నేత శుభేందు అధికారి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు నామినేషన్ ఫారాలను నందిగ్రామ్ ఆర్డీఓకు సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముందు మమతను లక్ష్యంగా చేసుకుని ఆమెపై విమర్శలు గుప్పించారు. టిఎంసి పార్టీ అనేది ఒక ప్రైవేట్ కంపెనీ అని ఎద్దేవా చేశారు.. మమత తోపాటు ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి మాత్రమే టిఎంసిలో మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని.. మిగతా వారెవరెవరికి అవకాశం లేదని ఆరోపించారు.
ఓటమి భయంతోనే మమతా బెనర్జీ దాడుల నాటకం ఆడుతున్నారని.. ప్రజలు ఈ పరిణామాన్ని గమనిస్తూనే ఉన్నారన్నారు. బెంగాల్ ప్రజలు నిజమైన అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి ఎన్నికల్లో బిజెపిని ఖచ్చితంగా గెలిపిస్తారని శుభేందు ధీమా వ్యక్తం చేశారు. ఇదిలావుంటే టిఎంసి అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇదే నియోజకవర్గం నుంచి రెండు రోజుల కిందటే నామినేషన్ దాఖలు చేశారు.