memorial for Bhopal gas tragedy victims భోపాల్ గ్యాస్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి జ్ఞాపకార్థం ఓ స్మారక చిహ్నం నిర్మించనున్నట్లు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. ప్రపంచంలోని ఏ నగరమూ మరో భోపాల్లా మారకూడదని ఈ స్మారకం గుర్తుచేస్తుందని ఆయన అన్నారు. అయితే,భోపాల్ గ్యాస్ విషాద ఘటన జరిగిన సరిగ్గా 36 ఏళ్లకు ఆయన ఈ ప్రకటన చేశారు.
1984 భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగి నేటికి 36 ఏళ్లు. ఈ సందర్భంగా మృతులకు సీఎం చౌహాన్ నివాళి అర్పించారు. అప్పటి ప్రమాదంలో తమ భర్తలను కోల్పోయిన మహిళలకు రూ.1000 చొప్పున పింఛను ఇచ్చే పథకాన్ని తిరిగి ప్రారంభిస్తామని చౌహాన్ ప్రకటించారు శివరాజ్.
2019లో కాంగ్రెస్ హయాంలో వితంతువులకు పింఛను నిలిపివేశారని… దానిని పునరుద్ధరిస్తామని సీఎం చౌహాన్ తెలిపారు. మరోవైపు,ఈ చీకటి రోజున బాధితులు, వారి కుటుంబసభ్యులు భోపాల్లో నిరసనలు చేశారు.
భోపాల్ దుర్ఘటనలో మిథైల్ ఐసోసైనేట్ రసాయనం వెలువడి 15 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 5 లక్షలమందికిపైగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. వీరిలో చాలా మంది ఇప్పుడు కరోనా కారణంగా చనిపోతున్నారు. భోపాల్ లో కరోనాతో ఇప్పటివరకు 518 మంది మరణించగా.. అందులో 102 మంది భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులే ఉన్నారు.