×
Ad

Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ విస్తరణ…ముగ్గురికి చోటు

  • Published On : August 26, 2023 / 10:07 AM IST

Shivraj Chouhan expands cabinet

Shivraj Chouhan expands cabinet : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శనివారం మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ తన కేబినెట్ లో ముగ్గురికి చోటు కల్పించారు. భోపాల్ నగరంలోని రాజ్ భవన్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ముగ్గురు ఎమ్మెల్యేలతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. (Shivraj Chouhan expands cabinet) 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో 15 శాతం అంటే 35 మందికి చోటు కల్పించవచ్చు.

Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధాని మోదీ శాల్యూట్

చౌహాన్ మంత్రివర్గంలో ప్రస్థుతం 31 మంది సభ్యులున్నారు. దీంతో శనివారం రాజేంద్ర శుక్లా, గౌరిశంకర్ బిసేన్, రాహుల్ లోధి లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యే అయిన వింధ్ ప్రాంత ఎమ్మెల్యే రాజేంద్ర శుక్లాకు ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. రాజ్ పుత్ నాయకుడైన గౌరిశంకర్ బిసేన్ కేబినెట్ మంత్రిగా చేరారు. ఓబీసీ నాయకుడైన రాహుల్ లోధికి తన మంత్రివర్గంలో సీఎం చౌహాన్ చోటు కల్పించారు. అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న బీజేపీ ఇప్పటికే 39మందితో తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.