Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధాని మోదీ శాల్యూట్

చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు....

Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధాని మోదీ శాల్యూట్

Modi meet Chandrayaan-3 team

Modi Isro visit : చంద్రయాన్-3 హీరోలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శాల్యూట్ చేశారు. ఆగస్టు 23వతేదీన చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ విజయవంతంగా దిగినందుకు ఈ కేంద్రంలో మోదీ ఇస్రో శాస్త్రవేత్తలను కలుసుకుని అభినందనలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులోని పీణ్య పారిశ్రామిక ప్రాంతంలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టెలిమెట్రీ, ట్రాకింగ్, కమాండ్ సెంటర్‌ను సందర్శించారు. బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. (PM gets emotional at meet with Chandrayaan-3 heroes) చంద్రయాన్-3 యొక్క ల్యాండర్ విక్రమ్ తాకిన చంద్రునిపై ఉన్న ప్రదేశాన్ని శివశక్తి పాయింట్ అని పిలుస్తామని ప్రధాని  బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రకటించారు.

Madhurai Train Fire Accident : మధురై రైలు బోగీల్లో ఘోర అగ్నిప్రమాదం, అయిదుగురి మృతి

‘‘నేను వీలైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకుని, మీకు నమస్కరించాలని, మీ ప్రయత్నాలకు సెల్యూట్ చేయాలని కోరుకున్నాను. మీరు చంద్రుడిపైకి మేక్ ఇన్ ఇండియా తీసుకెళ్లారు’’ అని బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్ధేశించి ప్రధాని చెప్పారు. ‘‘మా శాస్త్రవేత్తలు ల్యాండర్ మృదువైన ల్యాండింగ్‌ను పరీక్షించడానికి ఇస్రో పరిశోధనా కేంద్రం వద్ద కృత్రిమ చంద్రుడిని నిర్మించారు. ల్యాండర్ అక్కడ చంద్రుడిపైకి వెళ్లే ముందు పలు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించింది’’ అని ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్ధేశించి చెప్పారు.

Prime Minister Narendra Modi : రెండు దేశాల పర్యటన ముగించుకొని బెంగళూరు చేరిన మోదీ… చంద్రయాన్-3 బృందంతో భేటీ

రెండు దేశాల పర్యటన తర్వాత ప్రధానికి స్వాగతం పలికేందుకు ఢిల్లీలో చంద్రయాన్-3 పోస్టర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న ప్రధాని అక్కడ మూన్ మిషన్‌లో పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు. చంద్రయాన్-3 మిషన్ ల్యాండర్‌ను విజయవంతంగా టచ్‌డౌన్ చేసినందుకు గుర్తుగా భారతదేశం ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటుందని ప్రధాని చెప్పారు. 2019లో చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-2 తన పాదముద్ర వేసిన ప్రదేశాన్ని తిరంగా పాయింట్ గా పిలుస్తామన్నారు.

Madagascar : మడగాస్కర్‌లోని స్టేడియం తొక్కిసలాటలో 12 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు

భారతదేశం చంద్రునిపై ఉంది. మన జాతీయ గర్వాన్ని చంద్రునిపై ఉంచారని ఆయన చెప్పారు. తాను దక్షిణాఫ్రికాలో ఉన్నానని, కానీ తన మనస్సు మీతో ఉందన్నారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ బెంగళూరులో రోవర్ ప్రజ్ఞాన్, ల్యాండర్ విక్రమ్‌ల పరస్పర చర్చల గురించి ప్రధాని మోదీకి వివరించారు. ఇస్రో చైర్మన్ విక్రమ్ ల్యాండర్ ప్రతిరూపాన్ని ఆయనకు చూపించారు. అంతరిక్ష నౌక పరికరాల గురించి కూడా ఆయన ప్రధానికి వివరించారు.