Prime Minister Narendra Modi : రెండు దేశాల పర్యటన ముగించుకొని బెంగళూరు చేరిన మోదీ… చంద్రయాన్-3 బృందంతో భేటీ

దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వెలుపల ఉన్న మద్ధతుదారులను ఉద్ధేశించి ప్రసంగించారు....

Prime Minister Narendra Modi : రెండు దేశాల పర్యటన ముగించుకొని బెంగళూరు చేరిన మోదీ… చంద్రయాన్-3 బృందంతో భేటీ

Prime Minister Narendra Modi

Updated On : August 26, 2023 / 3:52 PM IST

Prime Minister Narendra Modi : దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ వెలుపల ఉన్న మద్ధతుదారులను ఉద్ధేశించి ప్రసంగించారు. చంద్రయాన్ -3 విజయానికి కారణమైన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి వ్యక్తిగతంగా కలవనున్నారు.

US Navy Fighter Jet : కూలిన యూఎస్ నేవీ ఫైటర్ జెట్…పైలట్ దుర్మరణం

బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ ఎయిర్‌పోర్టు వెలుపల ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధాని మోదీ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ అంటూ నినాదం చేశారు. బెంగళూరులో దిగిన తర్వాత ప్రధాని మోదీ తాను ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నానంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘బెంగళూరులో దిగాను. చంద్రయాన్-3 విజయంతో భారతదేశం గర్వపడేలా చేసిన మన అసాధారణమైన ఇస్రో శాస్త్రవేత్తలతో సంభాషించడానికి ఎదురుచూస్తున్నాను, అంతరిక్ష రంగంలో మన దేశం సాధించిన విజయాల వెనుక వారి అంకితభావం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

Madagascar : మడగాస్కర్‌లోని స్టేడియం తొక్కిసలాటలో 12 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు

ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు కర్ణాటక బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ప్రధాని మోదీని రిసీవ్ చేసుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ విమానాశ్రయానికి రాలేదు. ప్రధాని పర్యటనలో తమకు ఆహ్వానం అందలేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఇటీవల దక్షిణాఫ్రికాకు వెళ్లిన ప్రధాని మోదీ బుధవారం చంద్రయాన్-3 విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్‌కు ఫోన్‌లో శుభాకాంక్షలు తెలిపారు.