MP CM : ఏ దోస్తీ.. హమ్ నహీ చోడెంగే.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్

షోలే సినిమాలో యే దోస్తీ..హమ్ నహీ తోడెంగే..అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా...సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయలు పాడారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం శివరాజ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

MP CM : ఏ దోస్తీ.. హమ్ నహీ చోడెంగే.. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కైలాష్

Mp

Updated On : August 12, 2021 / 3:25 PM IST

‘Bhutta’ Party : షోలే సినిమాలో యే దోస్తీ..హమ్ నహీ తోడెంగే..అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. బ్యాక్ గ్రౌండ్ లో ఈ సాంగ్ ప్లే అవుతుండగా…సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయలు పాడారు. దీనికి సంబంధించిన వీడియోను సీఎం శివరాజ్ స్వయంగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read More : Chiranjeevi : మెగా మేకోవర్.. తమ్ముణ్ణి మిస్ చేసిన నాగబాబు..?

బుధవారం మధ్యప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఓ కార్యక్రమం జరిగింది. అందులో ముఖ్యమంత్రి శివరాజ్, ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. పార్టీ విభేధాలను పక్కన పెట్టి…పార్టీలో పాల్గొన్నారు. ‘భుట్టా’ పేరిట జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గీయ, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…షోలే చిత్రంలోని ‘ఏ దోస్తీ హమ్ నహీ ఛోడెంగే’ పాటను సీఎం శివరాజ్, కైలాష్ వర్గీయలు కలిసి పాడారు.

Read More : Google: మీ పిల్లల ఫోటోలు తొలగించమని గూగుల్‌ను అడగొచ్చు

వీరిద్దరీ మధ్య మంచి స్నేహం ఉంది. చౌహాన్, విజయ్ వర్గీయలు ఒకరినొకరు చేతులు పట్టుకుని..ఈ పాటకు అనుగుణంగా ఫెర్మామెన్స్ చేయడం విశేషం. 1975 నాటి షోలే చిత్రంలో అమితాబ్, ధర్మేంద్ర ఈ పాటను తన ట్విట్టర్ కి జోడిస్తూ..వారికి ట్యాగ్ చేశారు. కైలాష్ విజయ్ వర్గీయ కూడా ఇదే సాంగ్ తన ట్విట్టర్ కు జోడించారు. తాము యువమోర్చాలో ఉన్న రోజుల్లో పార్టీకి చేసిన సేవలు, ఎంత సన్నిహితంగా ఉన్నామో…అంటూ వెల్లడించారు. ‘మ్యూజికల్ షో ఆఫ్ యూనిటీ’ అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.