Sania Mirza And Shoaib Malik : సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారా? మాలిక్ ఇన్‌స్టా బయో మార్పుతో మరోసారి తెరపైకి విడాకుల అంశం..

భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.

Sania Mirza And Shoaib Malik

Sania Mirza And Shoaib Malik Divorce: భారత్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ మధ్య విడాకుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొద్ది నెలలుగా వారు విడిపోతున్నారన్న వార్తలు షికార్లు చేశాయి. అయితే, ఈ వార్తలపై సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా మరోసారి ఇద్దరూ విడాకులు తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు. షోయబ్ మాలిక్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో మార్పులు చేశాడు. గతంలో షోయబ్ ఇన్‌స్టాగ్రామ్ బయోలో ‘సూపర్ ఉమెన్ సానియా మీర్జా భర్త’ అని వ్రాయబడింది. అయితే, ఇప్పుడు మాలిక్ దానిని మార్చేశాడు. అతను, సానియా మీర్జా భర్త అనే పదాలను తన బయో నుండి తొలగించాడు. దీంతో సానియా, షోయబ్‌లు విడాకులు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

Sania Mirza: విడాకుల పుకార్లకు చెక్..! ఓటీటీలో ‘మీర్జా మాలిక్’ షో ద్వారా అసలు విషయం చెప్పనున్న సానియా, షోయబ్ జంట

షోయబ్, సానియా విడాకులు తీసుకున్నట్లు అధికారిక ధృవీకరణ లేదు. వీరిద్దరూ తమ విడాకుల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో షోయబ్ మాలిక్ పాకిస్థానీ నటి అయేషా ఉమర్ తో ప్రేమలో ఉన్నాడని వార్తలు వచ్చాయి. వీరిద్దరికి సంబంధించిన పొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ వైరల్ చిత్రాల గురించి నటి అయేషా మాట్లాడుతూ.. ఇవి కేవలం ఓ వాణిజ్య ప్రకటన కోసం తీసిన చిత్రాలు అని క్లారిటీ ఇచ్చింది. అయేషా, మాలిక్ మధ్య సంబంధంపై పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలోనే సానియా, షోయబ్ ల కొత్త టాక్ షో ‘ది మీర్జా మాలిక్ షో’ రావడంతో ఆ ఊహాగాన్నింటికి తెరపడింది. సానియా, షోయబ్‌లు పాల్గొనడంతో ఈ ప్రోగ్రామ్ కు మంచి ఆదరణ కూడా వచ్చింది.

Sania and Shoaib: చట్టపరమైన సమస్యల పరిష్కారం తర్వాత సానియా, షోయబ్ విడాకుల ప్రకటన.. పాక్ మీడియాలో కథనాలు..

సానియా మీర్జా, షోయబ్ మాలిక్‌లకు 2010లో వివాహం జరిగింది.  2018 అక్టోబర్‌లో వీరికి కొడుకు జన్మించారు. షోయబ్ మాలిక్ తో వివాహానికి ముందు సానియా మీర్జా తన చిన్ననాటి స్నేహితుడు సోహ్రాబ్ మీర్జాతో నిశ్చితార్ధం చేసుకున్నారు. కానీ కొన్నికారణాల వల్ల సోహ్రాబ్ – సానియాల నిశ్చితార్థం రద్దయిన విషయం తెలిసిందే. షోయబ్, సానియాలు విడాకులు తీసుకుంటున్నారని కొన్ని నెలలుగా ప్రసార మాద్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే, వీరు ఓ టాక్ షోలో పాల్గొనడంతో ఆ వార్తలకు పుల్ స్టాప్ పడింది. మళ్లీ మాలిక్ తన ఇన్‌స్టా బయోను మార్చడంతో సానియా, మాలిక్ విడాకుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.

Shoaib Malik Instagram Bio