Sania Mirza: విడాకుల పుకార్లకు చెక్..! ఓటీటీలో ‘మీర్జా మాలిక్’ షో ద్వారా అసలు విషయం చెప్పనున్న సానియా, షోయబ్ జంట

షోయబ్ మాలిక్, సానియా మీర్జాల వివాహం 2010లో జరిగింది. 2018 సంవత్సరంలో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. ప్రస్తుతం ఈ క్రీడా దంపతులు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఇద్దరూ టాక్ షో ద్వారా ఓటీటీలో అడుగు పెట్టనున్నట్లు తెలిసింది.

Sania Mirza: విడాకుల పుకార్లకు చెక్..! ఓటీటీలో ‘మీర్జా మాలిక్’ షో ద్వారా అసలు విషయం చెప్పనున్న సానియా, షోయబ్ జంట

Sania Mirza and malik

Sania Mirza: భారత టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయాబ్ మాలిక‌ల పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. వీరిద్దరు త్వరలో విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రముఖ ప్రసార మాద్యమాల్లోనూ కథనాలు ప్రచురితమయ్యాయి. ఓ పాకిస్థాన్ మోడల్‌తో షోయబ్ సన్నితంగా ఉంటున్నాడని, ఫలితంగా సానియాను దూరం పెట్టారంటూ జోరుగా చర్చ జరుగుతుంది. త్వరలో వారు అధికారికంగా విడాకుల నిర్ణయాన్ని ప్రకటిస్తారని పాక్ మీడియా పేర్కొంది. అయితే ఈ వార్తలపై సానియా, షోయబ్ లు ఇప్పటి వరకు స్పందించలేదు.

Sania and Shoaib: చట్టపరమైన సమస్యల పరిష్కారం తర్వాత సానియా, షోయబ్ విడాకుల ప్రకటన.. పాక్ మీడియాలో కథనాలు..

షోయబ్ మాలిక్, సానియా మీర్జాల వివాహం 2010లో జరిగింది. 2018 సంవత్సరంలో ఈ జంటకు ఓ కుమారుడు జన్మించారు. ప్రస్తుతం ఈ క్రీడా దంపతులు ఇద్దరు విడాకులు తీసుకుంటున్నారన్న ప్రచారానికి చెక్ పెట్టేలా ఇద్దరూ టాక్ షో ద్వారా ఓటీటీలో అడుగు పెట్టనున్నట్లు తెలిసింది. పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఉర్దూఫిక్స్‌లో ‘మీర్జా మాలిక్’ షోతో ఈ జంట ఒకే వేదికపైకి రాబోతున్నారట.

 

View this post on Instagram

 

A post shared by UrduFlix (@urduflixofficial)

ఈ విషయాన్ని స్వయంగా పాకిస్థాన్ ఓటీటీ ప్లాట్ ఫాం ఉర్దూఫిక్స్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. త్వరలో ఈ ప్రోగ్రాం రాబోతున్నట్లు తెలుస్తోంది.