Sania and Shoaib: చట్టపరమైన సమస్యల పరిష్కారం తర్వాత సానియా, షోయబ్ విడాకుల ప్రకటన.. పాక్ మీడియాలో కథనాలు..
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిపై వారిద్దరి నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. వారిద్దరు విడాకులు తీసుకొనేందుకు సిద్ధమయ్యారని, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించిన తర్వాత అధికారికంగా విడాకుల ప్రకటన చేయవచ్చని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.

sania mirza and shoaib malik
Sania Mirza and Shoaib Malik: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ దంపతులు విడాకులు తీసుకుంటున్నారంటూ గతకొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని వారిద్దరి నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. వారిద్దరు విడాకులు తీసుకొనేందుకు సిద్ధమయ్యారని, న్యాయపరమైన చిక్కులను పరిష్కరించిన తర్వాత అధికారికంగా విడాకుల ప్రకటన చేయవచ్చని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. పాక్ కు చెందిన పలు మీడియాల్లో ఇలాంటి కథనాలే ప్రచురితమయ్యాయి.
View this post on Instagram
సానియా, షోయబ్ మాలిక్‌లు విడాకులు తీసుకుంటున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. ఈవారం ప్రారంభంలో సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దీంతో వారు విడిపోవడానికి సంబంధించిన ఊహాగానాలకు మరింత ఆజ్యంపోసినట్లయింది. “విరిగిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి? అల్లాను కనుగొనడానికి, ”అని ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. దీనికితోడు సానియా వారి కుమారుడు ఇజాన్ తో కలిసి ఉన్న ఫొటోను కూడా పంచుకుంది. దీనికి ‘నాకు కష్టతరమైన రోజులలో ఉన్న క్షణాలు’ అంటూ రాసింది. మరోవైపు తన ఇన్ స్టాగ్రామ్ లో షోయబ్ బయో ఇప్పటికీ ‘అథ్లెట్ I సూపర్ ఉమెన్ సానియా మీర్జాకు భర్త’ అనే ఉంది.

shoaib malik
పాక్ మీడియాలో మాత్రం.. సానియా, షోయబ్ విడాలు తీసుకోవటం ఖాయమన్నట్లు కథనాలు ప్రసారమవుతున్నాయి. పాక్ కు చెందిన ప్రముఖ మోడల్, యూట్యూబర్ అయోషా ఓమర్ తో షోయబ్ ఎఫైర్ పెట్టుకున్నాడని, అదే ఈ క్రీడా దంపతుల మధ్య విడాకుల ప్రస్తావన వరకు వచ్చిందని పాక్ మీడియా తెలిపింది. మోడల్ తో కొన్ని నెలల క్రితం షోయబ్ ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనికితోడు ఆమెతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న షోయబ్ తన భార్య సానియాను దూరంపెట్టినట్లు పాక్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విడాకుల అంశంపై ఇప్పటి వరకు సానియా నుంచి కానీ, షోయబ్ నుంచి కానీ ఎటువంటి ప్రకటన రాలేదు.