అసోంలో నదిలో మంటలు

  • Publish Date - February 3, 2020 / 06:46 AM IST

అసోంలోని డిబ్రూగర్ జిల్లాలో అగ్నిప్రమాదం సంభవించింది. జిల్లాలోని బుర్హి డిహింగ్ నది తీరంలో ఉన్నఆయిల్ పైప్ లైన్ వద్ద మంటలు చెలరేగాయి. ఆయిల్ ఇండియాలిమిటెడ్ కు చెందిన దులియాజన్ ప్లాంట్ నుంచి ముడిచమురు తీసుకు వెళ్లే పైపు లైనుకు  నదీ తీరంలో లీకవటంతో ఆయిల్ నదిలోకి  వచ్చింది.

ఇది గమనించిన కొందరు నదీ  తీరంలో నిప్పు అంటించి ఉంటారని భావిస్తున్నారు. గత 3 రోజులుగా క్రూడాయిల్ నదిలోకి ప్రవహించి మంటలు వ్యాప్తి చెందుతున్నా అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని నహర్కటియాలోని సాసోని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.