Woman Ludo : ఇదేందయ్యా ఇది.. లూడో గేమ్‌లో పందెం ఓడి ఇంటి ఓనర్‌ వశమైన వివాహిత.. షాక్‌లో భర్త

లూడో గేమ్‌కు బానిసగా మారిన ఓ వివాహిత చివరికి తన ఇంటి యజమాని సొంతమైంది. భర్త పంపిన డబ్బులన్నీ అయిపోవడంతో తనపైనే పందెం కాసింది. ఆ ఆటలోనూ ఓడిపోవడంతో.. ఇంటి ఓనర్ వశమైంది.

Woman Ludo : ఏంటి.. టైటిల్ చూసి షాక్ అయ్యారా? లూడో గేమ్ లో ఓడిపోవడం ఏంటి? ఇంటి ఓనర్ సొంతం కావడం ఏంటి? అని డౌట్ వచ్చింది కదూ. కానీ, ఇది నిజం. లూడో గేమ్‌కు బానిసగా మారిన ఓ వివాహిత చివరికి తనకి ఇంటి యజమాని సొంతమైంది. ఉత్తర​ప్రదేశ్​లో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

ప్రతాప్‌గఢ్‌ కొత్వాల్ లో అద్దె ఇంట్లో నివాసం ఉండే వివాహిత లూడో గేమ్‌కు బానిస‌గా మారింది. తన భర్త లేని సమయంలో ఇంటి యజమానితో కలిసి లూడో ఆడేది. ఈ ఆటలో ఆమె చాలా డబ్బు పొగొట్టుకుంది. భర్త పంపిన డబ్బులన్నీ అయిపోవడంతో చివరికి ఆమె తనపైనే పందెం కాసింది. ఆ ఆటలోనూ ఓడిపోవడంతో.. ఆమె ఇంటి యజమాని వశమైంది. దీంతో ఇంటి యజమానితో కలిసి ఉంటోంది.

Also Read.. Fake Baba Arrest : నగ్నంగా ఫోటోలు దిగితే ధనవంతులు అయిపోతారు..! పాతబస్తీలో గలీజు బాబా అరెస్ట్

కాగా, ఈ విషయాన్ని జైపూర్‌లో ఉన్న తన భర్తకు ఆమె చెప్పింది. దీంతో అతడు షాక్ అయ్యాడు. తాను ఆటలో ఓడిపోయి ఇంటి యజమానికి సొంతం అయ్యానని.. మీరు ఇంటికి వస్తే యజమాని తనను చంపేస్తాడని వాపోయింది. ఈ విషయం తెలుసుకుని నివ్వెరపోయిన భర్త.. వెంటనే సొంత గ్రామానికి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యను కాపాడాలని వేడుకున్నాడు. కాగా.. తన భార్య నిత్యం జూదం, ఆన్​లైన్ గేమ్స్​ ఆడుతుండేదని భర్త వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read.. Transgender In UK : యూకేలో లింగమార్పిడికి పెరిగిన డిమాండ్.. పురుషులుగా మారాలనుకుంటున్న స్త్రీలు

వివాహిత.. ఇంటి యజమానితో కలిసి రోజూ లూడో ఆడేదని, భర్త పంపే డబ్బుతో పందెం కూడా కాసేదని పోలీసులు తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఒక రోజు లూడో ఆటలో డబ్బులన్నీ పోగొట్టుకున్న ఆమె.. చివరకు తనపైనే పందెం వేసుకుని ఓడిపోయిందని, దీంతో ఇంటి యజమానితో కలిసి ఆమె ఉంటోందని చెప్పారు. కాగా, వివాహిత భర్త ఆరు నెలల క్రితం పని కోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడ సంపాదించిన డబ్బుని ప్రతి నెలా భార్యకి పంపేవాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ మహిళ చేసిన పనికి అంతా విస్తుపోతున్నారు. కలికాలం అంటే ఇదే కాబోలు అని నిట్టూరుస్తున్నారు. ఇక ఆ భర్త పరిస్థితి దయనీయంగా ఉంది. భార్య ఇంటి యజమాని వశం కావడంతో లబోదిబోమంటున్నాడు. తన భార్య చేసిన పనికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాక జట్టు పట్టుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు