షాకింగ్ న్యూస్ : మహారాష్ట్రలో 41 కరోనా పాజిటివ్ కేసులు

  • Publish Date - March 18, 2020 / 03:47 AM IST

భారతదేశంలో కరోనా పంజా విసురుతోంది. దేశ వ్యాప్తంగా 142 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశం మొత్తం మీద కరోనా వైరస్ వల్ల ముగ్గురు చనిపోయారు. మిగతా రాష్ట్రాల కంటే మహారాష్ట్రలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు అక్కడ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేతో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆంక్షలను మరింత కఠినం చేసే ఆలోచనలో ఉన్నట్టు ఉద్దవ్ థాక్రే మోదీతో చెప్పినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే ముంబైలో మాల్స్, థియేటర్స్‌, యూనివర్సిటీలను మూసివేశారు. పబ్లిక్ ఫంక్షన్స్, ఈవెంట్స్, అనవసర ప్రయాణాలు రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అయితే కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రభుత్వం రవాణా వ్యవస్థపై కూడా కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు అనవసర ప్రయాణాలను తగ్గించుకోకపోతే.. రైళ్లు,బస్సులను కూడా నిలిపివేయాల్సి వస్తుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు.

Also Read | కొడుకు వ్యాపారానికి… మామ కోడలి బెడ్ రూంకి.. ఎంతకు తెగించాడంటే

కొత్తగా పశ్చిమబెంగాల్‌లో తొలికేసు నమోదయింది. దీంతో కరోనా మహమ్మారి మన దేశంలో 16 రాష్ట్రాలకు పాకినట్లయింది. మహారాష్ట్రలోనే 41 మందికి ఈ వైరస్ సోకగా తెలంగాణలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో ఒకరికి సోకింది. కరోనా విజృంభిస్తుండడంతో దేశంలోని పలు రాష్ట్రాలు ఏప్రిల్‌ 2వ తేదీ వరకు విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించాయి. సినిమా థియేటర్లు, మాల్స్‌, జిమ్‌ సెంటర్లు కూడా మూసేశాయి. 

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు చేపట్టాయి. కరోనా మృతుల సంఖ్య మూడుకి చేరడంతో కేంద్రం మరింత అప్రమత్తం అయ్యింది. ఇప్పటికే కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఈ నెలాఖరు వరకు దేశవ్యాప్తంగా పాఠశాలలు, యూనివర్సిటీలతో సహా థియేటర్లు, వ్యాయామశాలలు మూసివేయాలని సూచించగా…  తాజాగా అన్ని చారిత్రక కట్టడాలు, స్మారక చిహ్నాలు, కేంద్ర మ్యూజియాలను కూడా ఈ నెల 31 వరకు మూసివేయాలని  ఆదేశాలు జారీ చేసింది.

Read More : క్యా కరోనా : amazon హోమ్ డెలివరీ సేవలు బంద్