షాకింగ్ వీడియో: ఈ బుడ్డోడు వయసు రెండేళ్లు.. రైలు కింద పడి బతికాడు

  • Publish Date - September 25, 2020 / 07:53 AM IST

చిన్నపిల్లలు చాలా కొంటెగా ఉంటారు.. కొన్నిసార్లు చిన్న పొరపాటే వారిని పెద్ద ప్రమాదాలలో పడేస్తుంది. అటువంటి ఓ చర్యే ఊహించని పరిణామం.. రైలు పట్టాలపై ఓ బుడతడికి జరిగింది. ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌ ప్రాంతానికి చెందిన బల్లబ్‌ఘడ్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలో రైలు పట్టాలపై ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

తను నడుపుతున్న రైలు ముందు ఓ రెండేళ్ల బుడ్డోడు పడటాన్ని గమనించిన రైలు డ్రైవరు వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేసి ఆపాడు. అయితే అప్పటికే రైలు కొంత దూరం ప్రయాణించింది. ఏ ఘోరం చూడాల్సి వస్తుందో అని ఆందోళనగా దిగిన డ్రైవర్.. ఆ బాలుడు ఒంటి మీద కనీసం ఓ చిన్న దెబ్బ కూడా లేకుండా కనిపించడంతో ఊపిరి పీల్చుకున్నారు డ్రైవర్లు.



కాగా ఆ చిన్నారిని అతని అన్నయ్యే రైలు కిందకి తోసేశాడని తెలిసింది. ఆ బుడతడి ఆయుష్షు గట్టిది కాబట్టి బతకడం సాధ్యమైంది కానీ.. లేకుంటే అతను బతకటం అసంభవమని ఈ సంఘటన చూసిన వారు అంటున్నారు. తనతో ఉన్న మరో డ్రైవర్‌, ఇతరుల సహాయంతో ఇంజిన్‌ కింద ఇరుక్కున్న ఆ బాలుడిని బయటకు తెచ్చి వారి తల్లికి అప్పగించారు.

కాగా, ఆ గూడ్స్‌ రైలు డ్రైవర్‌ జరిగిన సంఘటన అంతా లిఖిత పూర్వకంగా పై అధికారులకు వివరించారు డ్రైవర్లు. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు డ్రైవర్లకు రైల్వే ఉన్నతాధికారులు బహుమతి ప్రకటించారు.




A #video of a 2-year-old child #stuck under the #engine of a #goods #train on #delhi#Agra railway track after he was thrown by a 13-year-old boy goes viral. The little boy had a #miraculous #escape. @spgrpagra @upgrp_hq pic.twitter.com/4G0yUHQmvS

— Anuja Jaiswal (@anujajTOI) September 23, 2020