ITI పూర్తి చేశారా.. సింగరేణిలో అప్రెంటిస్‌ షిప్ ట్రైనింగ్

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 09:26 AM IST
ITI పూర్తి చేశారా.. సింగరేణిలో అప్రెంటిస్‌ షిప్ ట్రైనింగ్

Updated On : November 4, 2019 / 9:26 AM IST

ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్ధులకు సింగరేణిలో అప్రెంటీస్ షిప్ ట్రైనింగ్ తీసుకోడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకు అర్హులైన.. ఆసక్తిగల అభ్యర్ధుల నుంచి సింగరేణి సంస్థ దరఖాస్తులను కోరుతోంది. నవంబర్ 7 నుంచి 16 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేపుకోవచ్చు. అభ్యర్ధులకు 28 సంవత్సరాలు మించకూడదు. SC, ST వారైతే 33 సంవత్సరాల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఇక సింగరేణి బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో నివసించే వారికి మాత్రం 80శాతం కేటాయిస్తారు. మిగతా జిల్లలవారికి 20 శాతం మాత్రమే కేటాయించనున్నారు. అంతేకాదు ఐటీఐ పూర్తి చేసిన సింగరేణి కార్మిక పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. 

ఇక అనుకున్న దానికంటే.. ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లైతే ముందుగా సీనియారిటీ పరంగా.. అంటే ఐటీఐ పాసింగ్ ఇయర్ ని, మార్కులను బట్టి అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతోంది.