Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్, ఆరుగురు మృతి

ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు.

Road Accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన వ్యాన్, ఆరుగురు మృతి

Salem road accident

Updated On : September 6, 2023 / 12:13 PM IST

Tamil Nadu Road Accident : తమిళనాడులోని సేలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో తమిళనాడులోని సేలం-ఈరోడ్ హైవేపై వేగంగా వెళ్తున్న వ్యాన్ అదుపుతప్పి నిలబడి ఉన్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్‌లో ఎనిమిది మంది ఉన్నారు. ఈంగూర్‌కు చెందిన ఎనిమిది మంది వ్యాన్‌లో పెరుంతురై వైపు వెళుతున్నారు. మృతులు సెల్వరాజ్, మంజుల, ఆరుముగం, పళనిసామి, పాపతి మరియు ఒక సంవత్సరం వయస్సు గల చిన్నారి ఉన్నారు.

East Godavari : ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బైక్, ముగ్గురు యువకులు దుర్మరణం

ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ విఘ్నేష్, మరో ప్రయాణికురాలు ప్రియ తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద దృశ్యాలు రికార్డు అయిన సీసీటీవీ వీడియోను స్వాధీనం చేసుకున్నారు.