Smriti Irani’s daughter Marriage: స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి.. అల్లుడు ఏం చేస్తాడో తెలుసా..!
Smriti Irani’s daughter Marriage: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్ ఇరానీ కెనడా ఎన్నారై అర్జున్ భల్లాను వివాహం చేసుకోబోతున్నారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : February 8, 2023 / 02:02 PM IST
Smriti Irani’s daughter Marriage: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షానెల్ ఇరానీ కెనడా ఎన్నారై అర్జున్ భల్లాను వివాహం చేసుకోబోతున్నారు. రాజస్థాన్ లోని ఫిబ్రవరి 9న వీరి పెళ్లి జరగనుంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు స్మృతి ఇరానీ కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు. – ఇప్పుడు వారసత్వ హోటల్‌గా కొనసాగుతున్న 15వ శతాబ్దపు ఖిమ్‌సర్ కోటలో షానెల్, అర్జున్ వివాహం జరుగుతుంది. డిసెంబర్ 2021లో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్న విషయాన్ని స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
ఎవరీ అర్జున్ భల్లా?
షానెల్ ఇరానీ వృత్తిరీత్యా న్యాయవాది. అర్జున్ భల్లా కుటుంబం కెనడాలో నివసిస్తోంది. అతడి తల్లిదండ్రులు సునీల్, షబీనా భల్లా, తమ్ముడు అమర్ ఉన్నాడు. కెనడా అంటారియోలోని సెయింట్ రాబర్ట్ కాథలిక్ ఉన్నత పాఠశాలలో తన పాఠశాల విద్యను అభ్యసించాడు అర్జున్. టొరంటోలోని సెయింట్ మైకేల్స్ కాలేజీ నుంచి బీఎస్సీ పూర్తి చేశాడు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ బీ చదివాడు.
అర్జున్ భల్లా కెరీర్
2014లో బ్రేక్ వాటర్ సొల్యూషన్స్ సంస్థలో అకౌంట్ మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఏడాది అక్టోబర్ లో యాపిల్ కంపెనీలో సాంకేతిక నిపుణుడిగా చేరారు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో లా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అర్జున్ భల్లా జంతు ప్రేమికుడు. అతడి వద్ద పెంపుడు జంతువు కూడా ఉంది.
Also Read: రూ. 50వేలు తీసుకొని ప్రియుళ్లతో పరారైన భార్యలు..! మరోసారి అలాచేయొద్దని అధికారులను వేడుకున్న భర్తలు..
కాగా, స్మృతి ఇరానీకి ఇద్దరు సంతానం జోర్ మరియు జోయిష్. తన భర్త జుబిన్ ఇరానీ మొదటి భార్య కూతురే షానెల్. అయితే తన సొంత కూతురిగానే షానెల్ ను చూసుకుంటారు స్మృతి ఇరానీ. షానెల్ పెళ్లి నేపథ్యంలో స్మృతి ఇరానీ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.
