UttarPradesh: రూ. 50వేలు తీసుకొని ప్రియుళ్లతో పరారైన భార్యలు..! మరోసారి అలాచేయొద్దని అధికారులను వేడుకున్న భర్తలు ..

ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి నిర్మాణంకు కేంద్రం విడుతల వారిగా డబ్బులు జమ చేస్తుంది. ఈక్రమంలో బారాబంకీ జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన మహిళా లబ్ధిదారులకు మొదటి విడతలో రూ. 50వేల నగదు వారి ఖాతాల్లో పడింది. ఆ నగదు తీసుకొని పలువురు మహిళలు భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు.

UttarPradesh: రూ. 50వేలు తీసుకొని ప్రియుళ్లతో పరారైన భార్యలు..! మరోసారి అలాచేయొద్దని అధికారులను వేడుకున్న భర్తలు ..

Uttarpradesh

Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్‌లో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. బారాబంకీ జిల్లాలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎం ఆవాస్ యోజన) మొదటి విడత డబ్బులు తమ ఖాతాల్లో పడిన వెంటనే కొందరు భార్యలు భర్తలకు షాకిచ్చారు. ఆ డబ్బును తీసుకొని ప్రియుళ్లతో పరారయ్యారు. భార్యలు చేసిన పనికి కంగుతిన్న భర్తలు.. అధికారుల వద్దకు వెళ్లి మరోసారి అలాచేయొద్దంటూ వేడుకున్నారు.

VIral News: బావిలో పడ్డా.. ప్రియురాలు దక్కింది..! అదృష్టమంటే వీడిదేకాబోలు..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులైన పేదవర్గాల ప్రజలకు పక్కా ఇల్లు కట్టించేందుకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే, ఈ పథకం కింద మహిళలు లబ్ధిదారులుగా ఉంటారు. లక్నోకు ఆనుకొని ఉన్న బారాబంకీ జిల్లా పరిధిలోని నగర పంచాయతీ బెల్హారా, బంకీ, జైద్ పూర్, సిద్దౌర్‌లోని కొందరు మహిళలు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. మొదటి విడుతగా ఇటీవల వారి ఖాతాల్లో రూ. 50వేల చొప్పున అధికారులు జమ చేశారు. ఇందులో నలుగురు మహిళలు డబ్బు తమ ఖాతాల్లో పడగానే భర్తను వదిలేసి తమ ప్రియుళ్లతో పర్యారయ్యారు. ఫతేపూర్‌లోని ఇద్దరు మహిళలు కూడా ప్రియుళ్లతో పరారయ్యారు. కొద్దిరోజుల తరువాత లబ్ధిదారులు ఇంటి నిర్మాణం పనులు ఇంకా చేపట్టకపోవటంతో అధికారులు నోటీసులిచ్చారు. అయినా పనులు ప్రారంభం కాకపోవటంతో ఆయా గ్రామాలకు వెళ్లి ఆరాతీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 

భార్యలు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న భర్తలు అధికారులకు పలు విజ్ఞప్తులు చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం రెండో విడత నిధులు తమ భార్యల ఖాతాల్లో వేయొద్దని, తమ ఖాతాల్లో జమ చేయాలని వేడుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.