Facebook Rape : ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై

Facebook Rape

Facebook Rape : నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేప్ కేసుల్లో రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మార్పు రావడం లేదు. మహిళకు రక్షణ లభించడం లేదు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఆడవారిపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కొందరు మానవ మృగాళ్లు కామంతో కళ్లు మూసుకుపోయి దారుణాలకు ఒడిగడుతున్నారు. కొందరు నీచులు స్నేహం ముసుగులో లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. నమ్మించి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురలో దారుణం జరిగింది. కదులుతున్న కారులో యువతిపై గ్యాగ్ రేప్ జరిగింది.

Dinner : సూర్యాస్తమయానికి ముందే రాత్రి భోజనం ఎందుకంటే?

తోడు వచ్చిన స్నేహితుడే మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారం చేశాడు. మధురకు చెందిన బాధితురాలు(21) మంగళవారం ఎస్ఐ పరీక్ష రాసేందుకు ఆగ్రా వెళ్లింది. తోడుగా ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయిన తేజ్ వీర్(25) అనే వ్యక్తిని తీసుకెళ్లింది. ఎగ్జామ్ రాసిన తర్వాత కారులో వెళ్తుండగా మరో వ్యక్తితో కలిసి తేజ్ వీర్ తనపై అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

తేజ్ వీర్ ది హర్యానాలోని పల్వాల్. మూడు నెలల క్రితం యువతికి ఫేస్ బుక్ లో పరిచయం అయ్యాడు. మంగళవారం అతడు తన డ్రైవర్ తో కలిసి యువతి వెంట వెళ్లాడు. కాగా, కారులో ఎక్కిన కాసేపటికి తేజ్ వీర్ తనకు ఓ డ్రగ్ వాసన చూపించాడని, దాంతో తాను స్పృహ కోల్పోయానని వివరించింది. స్పృహలోకి వచ్చేసరికి కోసికళ దగ్గర ఢిల్లీ-ఆగ్రా నేషనల్ హైవేపై ఉన్నానని తెలిపింది. ఆ తర్వాత ఎలాగో తన ఇంటికి చేరుకున్నానని, జరిగింది తన కుటుంబానికి వివరించానని తెలిపింది. గ్రామీణ ఎస్పీ శిరీష్ చంద్ర దీనిపై స్పందించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై సెక్షన్ 376(రేప్) కింద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రర్ చేశామన్నారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ఇకపోతే నిందితుడి కచ్చితమైన అడ్రస్ కూడా యువతికి తెలియదని పోలీసులు చెప్పారు.

Chrome Password Checker : మీ పాస్‌వ‌ర్డ్ హ్యాక‌ర్ల చేతుల్లో.. అయితే డౌటే.. ఇలా చెక్ చేసుకోండి!

సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో పరిచయాలు, స్నేహ్నాలు మంచివి కావన్నారు. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, ఫొటోలు షేర్ చేయకపోవడమే సురక్షితం అన్నారు. ఎదుటి వ్యక్తిగా గురించి పూర్తిగా తెలుసుకోకుండానే గుడ్డిగా నమ్మడం మనకే నష్టం అని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు