షార్ట్ డ్రెస్‌లు వేసుకున్న మహిళలపై అత్యాచారాలు చేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ లేడీ తన తప్పు తెలుసుకుంది. తాను చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పింది సోమా చక్రవర్తి అనే ఈ మహిళ.. ప్రతి మహిళ ఆత్మాభిమానాన్ని తాను గౌరవిస్తానంటూ చెప్పుకొచ్చింది. ఈమెలో ఇంత మార్పు రావడానికి కారణం ఆమె ఆలోచనా ధోరణి కాదు..సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు రావడంతోనే కావడం గమనార్హం.
ఢిల్లీలో మహిళల దుస్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన సోమా చక్రవర్తి అనే ఓ మిడిలేజ్ లేడీ తన తప్పు ఒప్పుకుంది. షార్ట్ డ్రస్ వేసుకోవడం వల్లనే రేప్‌లు జరుగుతున్నాయంటూ వ్యాఖ్యానించడమే కాకుండా..తానేదో పెద్ద ఘన కార్యం చేసినట్లు సమర్ధించుకుందీ లేడీ. అయితే ఇదే సంఘటనని దాదాపు 20వేల మంది షేర్ చేయడంతో బోలెడంతమంది ఆమెపై విమర్శలకు దిగారు. దీంతో విషయం ఇంకాస్త పెద్దదై కేసుల వరకూ వెళ్లకముందే తన తప్పు తాను తెలుసుకున్నానంటూ ఫేస్‌బుక్‌లో చెప్పుకొచ్చింది.
ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు కానీ..అవతలివారి దుస్తుల గురించి అనుచితంగా మాట్లాడటమే కాకుండా వారితో వాదనకి కూడా దిగింది గుర్‌గావ్‌లోని సోమా చక్రవర్తి. పొట్టి దుస్తులు వేసుకున్నవారిపై అత్యాచారం చేయాల్సిందేనంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టింది. గుర్‌గావ్ రెస్టారెంట్‌లో ఈమె హడావుడితో ఇబ్బందులు పాలైన అక్కడి మహిళలు వారించినా వినలేదు.
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని హెచ్చరించినా వినకుండా..చివరికి ఫేస్‌బుక్కైతే కానీ విషయం తీవ్రత అర్ధం సోమా చక్రవర్తికి. ఇంత చేసిన ఈ సోమా చక్రవర్తి షార్ట్ మిడ్డీస్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో జనం వైరల్ చేశారు. దీంతో అమ్మగారి బండారం కాస్తా..రచ్చ అయింది. ఇక చేసేది లేక తాను చేసిన కామెంట్లకు ఎలాంటీ దురుద్దేశ్యాలు లేవని చెప్పుకుంటూ ఓ పోస్ట్ పెట్టి జంపైంది.