ఢిల్లీలో కొందరు నాకే ప్రజాస్వామ్యం నేర్పించాలనుకుంటున్నారు: పీఎం మోడీ

PM Modi: ఢిల్లీలో కొందరు ‘నాకు ప్రజాస్వామ్యం గురించి పాఠాలు చెప్పాలనుకుంటున్నారు’ అని ప్రధాని నరేంద్ర మోడీ అంటున్నారు. పీఎం మోడీపై వేసిన కౌంటర్‌కు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై రివర్స్ కౌంటర్ వేసిన మోడీ.. ఇలా బదులిచ్చారు. అంతకంటే ముందు రాహుల్.. ఇండియాలో ప్రజాస్వామ్యం లేకుండాపోయింది. పీఎం మోడీకి వ్యతిరేకంగా ఎవరు నిలబడగలరు. ఒకవేళ అలా చేస్తే టెర్రరిస్టులు అని ముద్ర వేస్తారని ఆరోపించారు.

‘ఢిల్లీలో ఉండి నన్ను అవమానిస్తున్నారు. నాకు ప్రజాస్వామ్యం నేర్పించాలనుకుంటున్నారు. వారికి జమ్మూ అండ్ కశ్మీర్ డీడీసీ (డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్)పోల్స్ ను ప్రజాస్వామ్యానికి ఉదహారణగా చెప్పాలనుకుంటున్నా’ అని పీఎం మోడీ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లాంచ్ చేసిన తర్వాత మాట్లాడారు.

‘కొన్ని రాజకీయ బలగాలు.. డెమోక్రసీ లెక్చర్లు ఇస్తున్నాయి. కానీ, వాళ్లు తమ పద్ధతి గురించి తెలుసుకోలేకపోతున్నారు. సుప్రీం కోర్టు ఆర్డర్ పక్కకు పెట్టి పుదుచ్చేరిలో స్థానిక ఎన్నికలు ఇంకా నిర్వహించలేదు’

‘జమ్మూ అండ్ కశ్మీర్ లో ప్రజలు ప్రజాస్వామ్యం బలపడేలా చేసినందుకు కంగ్రాట్స్ తెలియజేస్తున్నాం. యువకులు, వృద్ధులు పోలింగ్ బూత్ ల వద్దకు వచ్చి ఓటును వినియోగించుకున్నారు. డీడీసీ పోల్స్ లో జమ్మూ అండ్ కశ్మీర్ వాసులు ప్రజాస్వామ్యం మూలాలను కాపాడారు’ అని మోడీ అన్నారు.

జమ్మూ అండ్ కశ్మీర్ 20జిల్లాల్లో జరిగిన డీడీసీ ఎన్నికల్లో ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలో కాంగ్రెస్ తో ఒప్పందం కుదుర్చుకుని 13జిల్లాల్లో గెలుపొందారు. కాగా, బీజేపీ జమ్మూలోని 6జిల్లాల్లో విజయం సాధించింది. తొలిసారి జమ్మూలో గెలిచిన బీజేపీ.. లోయల్లో కమలం పూస్తుందని చెప్తూ వస్తుంది.