Xiaomi : కస్టమర్లకు షాక్, షావోమీ ధరల పెంపు

చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది.

Xiaomi India

Xiaomi TVs And Smartphones : చైనా స్మార్ట్ ఫోన్ లో దిగ్గజ కంపెనీగా పేరొందిన షావోమీ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. ధరలను పెంచాలని నిర్ణయం తీసుకుంది. భారత మార్కెట్ లో టాప్ పొజిషిన్ లో నిలిచింది. స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీలతో మార్కెట్ లో మంచి పేరు సంపాదించుకుంది. వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్థ తన ఉత్పత్తులధరలపై 3-6 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ధరలు పెంచడానికి గల కారణాలు వెల్లడించింది. విడిభాగాల కొరత, దిగుమతి వ్యయాల కారణంగా జూలై 1 నుంచి కొత్త ధరలను సవరిస్తున్నట్టు వెల్లడించింది.

తమ స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల ధరలు జూలై 01వ తేదీన సవరించిన ధరలను అమల్లోకి వస్తాయని తెలిపింది. షిప్పింగ్ ఛార్జీల భారం, కాంపోనేట్స్ కొరతల కారణొంగా..ధరల పెంపు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంస్థ వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్‌లలో (చిప్‌సెట్‌లు, డిస్ప్లే ప్యానెల్లు, డిస్ప్లే డ్రైవర్, బ్యాక్ ప్యానెల్లు, బ్యాటరీ మొదలైనవి) ఉపయోగించే భాగాల ధరలు బాగా పెరిగాయని తెలిపారు. సముద్ర సరుకు రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని, ఈ నిర్వహణ వ్యయం పెరగడం వల్ల దేశీయంగా రవాణా ఖర్చులు ఏప్రిల్‌లో బాగా పుంజుకున్నాయని సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో..ఇతర కంపెనీలు కూడా ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.