Sonia Gandhi: మరోసారి ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ..

జూన్ 7న సైతం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో ఆమె అడ్మిట్ అయ్యారు.

Sonia Gandhi: కాంగ్రెస్ కీలక నేత సోనియా గాంధీ మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రి గ్యాస్ట్రో డిపార్ట్ మెంట్ లో సోనియా అడ్మిట్ అయ్యారు. సోనియా గాంధీ ఉదర సంబంధ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నారు. సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని సర్ గంగారామ్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారనే వార్త తెలిసి పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి.

కాగా, జూన్ 7న సైతం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరారు. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్, హాస్పిటల్ లో ఆమె అడ్మిట్ అయ్యారు. డాక్టర్ల బృందం సోనియాకు పలు రకాల టెస్టులు చేసింది. ఆమె ఆరోగ్య పరిస్థితి నార్మల్ గా ఉందని చెప్పింది.