ఢిల్లీ అల్లర్లను కాంగ్రెస్ నేత సోనియా గాంధీ ఖండించారు. వెంటనే హోం శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈశాన్య ఢిల్లీలో జరిగిన హింసపై ఆమె స్పందించారు. 2020, ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతో పాటు ప్రశ్నలు సంధించారు. అల్లర్లు జరగడం బాధగా ఉందని, దీనికి కారణం బీజేపీనేని ఆరోపించారు.
ముందస్తు ప్రణాళికతోనే అల్లర్లు సృష్టించారని, ఈ అల్లర్లకు బాధ్యత వహించి హోం శాఖా మంత్రి రాజీనామా చేయాలని, ఈ సమయంలో అమిత్ షా ఎక్కడున్నారని సూటిగా ప్రశ్నించారు. ఇంత విధ్వంసం జరుగుతుంటే..ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కపిల్ మిశ్రా చేసిన ప్రసంగం రెచ్చగొట్టే విధంగా ఉందని, పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు తగినంత భద్రతను మోహరించాలని..సమస్యాత్మక ప్రాంతాలపై సీఎం దృష్టి సారించాలని సూచించారు.
తగినంత బలగాలను మోహరించడంలో నిర్లక్ష్యం వహించారని తెలిపారు. అల్లర్ల బాధితులకు కాంగ్రెస్ నేతలు సహాయం అందించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
* 2020, ఫిబ్రవరి 23వ తేదీన ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్ చౌక్‌లో బీజేపీ నాయకుడు కపిల్ మిశ్రా పౌరసత్వసవరణ చట్టం (CAA)అనుకూల ర్యాలీకి నాయకత్వం వహించి రెచ్చగొట్టే ప్రసంగం చేశాడు.
* మిశ్రా చేసిన రెచ్చగొట్టే ప్రసంగంపై బీజేపీ అగ్రనాయకత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.
* సోమవారం ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన హెడ్ కానిస్టేబుల్ రతన్ లాల్ కుటుంబాన్ని మనోజ్ తివారీ,కేంద్రమంత్రి హర్షవర్థన్ పరామర్శించారు.
* ఈశాన్య ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నాం నుంచి సీఏఏ అనుకూల,వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.
* ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 20కి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.
* ఇరు వర్గాలు రాళ్లు విసురుకుని, షాపులు, వాహనాలను తగులబెట్టేశారు. భారీగా ఆస్థినష్టం కూడా సంభవించింది.
* 150 మందికి పైగా గాయాలపాలయినట్లు సమాచారం.
* ఈశాన్య ఢిల్లీలో బుధవారం జాతీయ భద్రత సలహారు అజిత్ దోవల్ పర్యటించారు.
Read More>>ఢిల్లీలో అల్లర్లు : మసీదుపై కాషాయ జెండా!
See Also>>ఢిల్లీ అల్లర్లు..అర్ధరాత్రి ఎంట్రీ ఇచ్చిన ట్రబుల్ షూటర్