కుమారుడికి డిప్యూటీ సీఎం పగ్గాలు.. ఇంతకీ ముఖ్యమంత్రి స్టాలిన్ స్కెచ్‌ ఏంటి?

సడెన్ గా ఇప్పుడే ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎందుకు అనిపించింది?

Tamil Nadu Politics (Photo Credit : Google)

Tamil Nadu Politics : తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందే డీఎంకే పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్… ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే, డీఎంకేలో నెంబర్ 2 గా మారారు. ఇంతకీ, ఉదయనిధికి డిప్యూటీ సీఎం పగ్గాలు అప్పగించడం వెనుక స్టాలిన్ స్కెచ్ ఏంటి? ఈ సన్ రైజ్ కి కారణం ఏంటి?

సడెన్ గా ఇప్పుడే ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎందుకు అనిపించింది? డీఎంకేలో నెంబర్ 2గా ఉంటే ఆ తర్వాత నెంబర్ 1 స్థానానికి వెళ్లడం ఈజీ అవుతుందనా? ఈ ఒక్క కారణమే కాదు.. రాబోయే ఎన్నికలు తమిళనాడులో చాలా కీలకమైనవి. పైగా డీఎంకేకు చాలా ప్రతిష్టాత్మకం కూడా. ఈసారి ఎన్నికల్లో పొలిటికల్ హీట్ మామూలుగా ఉండదు. దళపతి విజయ్ ఇప్పటికే పార్టీ పేరు, జెండా, అజెండా ప్రకటించి.. జనంలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారు. మరి అధికార పార్టీ అయ్యి ఉండి మొద్దు నిద్రపోతే డీఎంకే మనుగడే ప్రశ్నార్థకం అవుతుందన్న ఆలోచన కావొచ్చు. స్టాలిన్ ముందుగానే జాగ్రత్త పడున్నట్లు ఉన్నారు..

Also Read : ఆఫీసులోని వాష్‌రూమ్‌లో కార్డియాక్ అరెస్ట్‌తో ఉద్యోగి మృతి