సోనూసూద్ మొబైల్‌కు ఫ్రీ రీఛార్జ్ కావాలట!!

శనివారం ఉదయం SONU SOOD తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులను ఈ ప్రశ్నఅడిగాడు. తనకు మొబైల్ కు ఫ్రీ రీఛార్జ్ చేయగలరా అంటూ జోక్ వేశాడు. ఇంతకీ అదేంటంటే.. తన పేరు మీద ‘RK Sonu Sood Mobile Store’అంటూ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్ ఒకటి ఓపెన్ చేశాడు సోనూ అభిమాని. అది ఎలా చేరిందో సోనూసూద్ వరకూ చేరింది. దానిని అభిమానులతో పంచుకుంటూ ఇలా జోక్ చేశాడు.

దాంతో పాటు మరో పోస్టు పెట్టాడు. మీత్ అనే కొరియాగ్రాఫర్ 50శాతం కాలిన గాయాలతో బాధపడుతున్నాడు. అతనికి ట్రీట్‌మెంట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. సరిపడ డబ్బులు లేక ఇబ్బందిపడుతున్నాడంటూ అతని స్నేహితులు ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ పోస్టు సోనూసూద్ వరకూ చేరి స్వయంగా వచ్చి ట్రీట్‍మెంట్ కు అయ్యే ఖర్చు భరించాడంటూ చేసిన పోస్టును సోనూ సూద్ షేర్ చేశాడు.



అక్టోబరు 23న సోనూ మరో పోస్టు షేర్ చేశాడు. అభిమానుల నుంచి తమను ఆదుకోవాలంటూ వందల్లో వస్తున్న మెయిల్స్, లెటర్స్ ను చూపిస్తూ.. పోస్టు పెట్టాడు. ప్రతి రోజూ సాయం కోరుతూ మెయిల్స్ వస్తూనే ఉన్నాయి. నాకు తెలిసి నేనందరినీ కలవాలనే అనుకుంటున్నా. కానీ, అది సాధ్యం కాకపోవచ్చు. ఏదో ఒకరోజు ఈ లెటర్స్ మొత్తం తగ్గిపోతాయనుకుంటున్నా. అంతటి సామర్థ్యం ప్రతిచోటా రావాలని కోరుకుంటున్నా’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు.

కరోనా లాక్ డౌన్ సమయం నుంచి సోనూసూద్ ఇన్ స్టాగ్రామ్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లు వరదల్లాంటి మెసేజ్ లతో నిండిపోతున్నాయి. మహమ్మారి సమయంలో ముందుకొచ్చి సాయం చేసిన వ్యక్తి సోనూ. నిస్వార్థంగా ఆపన్నహస్తం అందించి వలస కార్మికులను సొంతిళ్లకు చేర్చాడు. వైద్య పరమైన సాయంతో పాటు, ఉద్యోగాలు కోల్పోయిన వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాడు. ఇటీవలే ప్రతిష్ఠాత్మకమైన ఎస్డీజీ స్పెషల్ హ్యుమనిటేరియన్ యాక్షన్ అవార్డును యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రాం నుంచి అందుకున్నాడు.