Sonu Sood: ఆన్‌లైన్ క్లాసులు డిస్టర్బ్ కాకుండా.. సిగ్నల్స్ కోసం టవర్ నిర్మిస్తున్న సోనూసూద్

ఇండియాలో తలెత్తిన సమస్య ఎలాంటిదైనా.. ఎప్పుడైనా సాయం చేయడానికి తానున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు సోనూ. కోట్ల మంది మనస్సులు గెలుచుకున్న సోనూసూద్.. మరో అడుగు ముందుకేశారు.

Sonu Sood: ఆన్‌లైన్ క్లాసులు డిస్టర్బ్ కాకుండా.. సిగ్నల్స్ కోసం టవర్ నిర్మిస్తున్న సోనూసూద్

Sonusood

Updated On : June 30, 2021 / 5:16 PM IST

Sonu Sood: ఇండియాలో తలెత్తిన సమస్య ఎలాంటిదైనా.. ఎప్పుడైనా సాయం చేయడానికి తానున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నాడు సోనూ. కోట్ల మంది మనస్సులు గెలుచుకున్న సోనూసూద్.. మరో అడుగు ముందుకేశారు.

కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణాన్ని తలపెట్టిన ఆయన.. వయానాడ్ లో విద్యార్థుల కోసం సెల్ ఫోన్ టవర్ నిర్మించాలని అనుకుంటున్నారు. ట్రైబల్ ఏరియాల్లో సిగ్నల్స్ లేని కారణంగా ఆన్ లైన్ క్లాసుల కోసం కొన్ని కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి క్లాసులు వినాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇవన్నీ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో తక్కువ సిగ్నల్ వస్తుంటే.. మరి కొన్ని ప్రాంతాల్లో సిగ్నల్ అస్సలు లేకపోవడంతో ఇబ్బంది కనిపిస్తుంది. ఈ విషయం సోనూ సూద్ కు తెలియగానే మొబైల్ టవర్ నిర్మాణం చేయాలని ఏర్పాట్లు మొదలుపెట్టేశాడు.

దీని గురించి ట్వీట్ చేసిన ఆయన.. ‘ఒక్కరు కూడా చదువును మిస్ చేసుకోకూడదు. వయానాడ్, కేరళలో ప్రతి ఒక్కరికీ చెబుతున్నా. టీంను పంపించి అక్కడ మొబైల్ టవర్ ఏర్పాటు చేస్తాను. వెంటనే పనులు చూడాలని ఫౌండేషన్ ను ట్యాగ్ చేశారు.