కార్మికులకు ఉపాధి కోసం Pravasi Rojgar app : సోనూసూద్

  • Publish Date - July 23, 2020 / 09:03 AM IST

నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరింత విస్తరింప చేయాలని డిసైడ్ అయ్యాడు.

వలస కార్మికుల సంక్షేమం కోసం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వారికి ఉపాధి కల్పించేందుకు కొత్త యాప్ ను విడుదల చేయనున్నారు. 2020, జులై 23వ తేదీ గురువారం రిలీజ్ చేస్తారు. పనులు లేక అల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకొనేందుకు తాము ఈ యాప్ ను తయారు చేయడం జరిగిందంటున్నాడు సోనూ సూద్.

‘Pravasi Rojgar’ పేరిట ఆన్ లైన్ app ను రూపొందించారు. Delhi, Mumbai, Bangalore, Hyderabad, Coimbatore, Ahmedabad, Thiruvananthapuram లో 24 X 7 Helpline ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

టాప్ సంస్థలు, స్ట్రాటజీ కన్సలెంట్స్, ప్రభుత్వ కార్య నిర్వాహకులు, టెక్నాలజీ యాప్ తో చర్చించి…ఈ యాప్ ను తీసుకరావడం జరిగిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని వలస కార్మికులకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించేల ఈ Online Flat Form రూపొందించామన్నారు.

construction, apparel, healthcare, engineering, BPOs, security, automobile, e-commerce, logistics రంగాలకు చెందిన 500 ప్రసిద్ధ కంపెనీల ద్వారా..ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సోనూ సూద్.

ట్రెండింగ్ వార్తలు