Ganguly Daughter
Ganguly Daughter : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కుమార్తె సనా గంగూలీ కరోనా కరోనా బారినపడ్డారు. స్వల్ప జ్వరం ఉండటంతో సనా గంగూలీ కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆమె హోంక్వారంటైన్‌లోకి వెళ్ళిపోయింది
చదవండి : Sourav Ganguly : టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ క్లారిటీ!
ఇటీవల, సౌరవ్ గంగూలీకి కూడా కరోనా వైరస్ బారినపడ్డారు, అతను కొన్ని రోజులు ఆసుపత్రిలో చేరాడు. సౌరవ్ గంగూలీకి డెల్టా వేరియంట్ కరోనా సోకినట్లుగా వైద్యులు తెలిపారు. అయితే ఒమిక్రాన్ నిర్దారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించగా రిపోర్ట్ ప్రతికూలంగా వచ్చింది.
చదవండి : Sourav Ganguly: గెలిచే జట్టు అదే.. వాళ్లు గట్స్ ఉన్న ప్లేయర్లు – గంగూలీ
సౌరవ్ గంగూలీ కొన్ని రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకోని డిశ్చార్జ్ అయ్యాడు, ప్రస్తుతం హోం క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. ఇక ఇదే సమయంలో ఆయన కూతురికి కరోనా సోకింది. అయితే గతంలో ఓ సారి గుండె సమస్య రావడంతో గంగూలీ వుడ్ ల్యాండ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే.. వారానికిపైగా చికిత్స తీసుకోని డిశ్చార్జ్ అయ్యారు.
చదవండి : Sourav Ganguly: గెలిచే జట్టు అదే.. వాళ్లు గట్స్ ఉన్న ప్లేయర్లు – గంగూలీ
ఇక సనా గంగూలీ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో చదువుతున్నారు. కరోనా కారణంగా యూనివర్సిటీలో తరగతులు నిలిచిపోయాయి. దీంతో ఆమె కోల్‌కతాలోనే ఉంటున్నారు.