sparks row in Kerala over Ambedkar photo in savarna attire
Ambedkar photo in savarna attire: హిందూమతంలోని అట్టడుగు, వెనుకబడిన వర్గాల కోసం చేసిన పోరాటంలో ఇక్కడి సంప్రదాయాలు, పద్దతులపై బాబాసాహేబ్ అంబేద్కర్ యుద్ధమే చేశారు. వందలాది పుస్తకాలు రాసిన ఆయనపై వేలాది పుస్తకాలు ముద్రితం అయ్యాయి. ఏ పుస్తక షాపుకు వెళ్లినా అంబేద్కర్ కవర్ పేజీతో ఉన్న పుస్తకాలు వందల కొద్ది కనిపిస్తాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఒక పుస్తక కవర్ ఫొటోగా అంబేద్కర్ ఫొటో ఉండడం తీవ్ర వివాదానికి దారి తీసింది. కారణం.. ఏ వ్యవస్థపై అయితే అంబేద్కర్ విరోచిత పోరాటం చేశారో.. ఆ సంప్రదాయంలో అంబేద్కర్‌ను కూర్చోబెట్టారు.
కేరళకు చెందిన డీసీ బుక్స్ వారు మలయాళీ మెమోరియల్ అనే పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఈ పుస్తకంపై కవర్ ఫొటోగా అంబేద్కర్ చిత్రాన్ని ముద్రించారు. అయితే ఈ చిత్రంలో అంబేద్కర్ కాసవు దోతి, చొక్కా ధరించి, భూస్వామ్య కుటుంబంలో కుర్చీపై కూర్చొని ఉన్నారు. చూస్తుంటే కేరళకు చెందిన సవర్ణ హిందువుగా అంబేద్కర్ కనిపిస్తారు. దీంతో అంబేద్కర్ వాదుల నుంచి ఇతర వర్గాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అంబేద్కరిస్టులను తప్పుదోవ పట్టించడానికే బాబాసాహేబ్‌ను ఇలా చిత్రించారని కొందరు అంటుండగా.. ఇదంతా మార్కెస్ స్ట్రాటజీ అంటూ మరికొందరు విమర్శిస్తున్నారు.
‘‘భూస్వామిగా, సవర్ణ హిందువుగా అంబేద్కర్‌ని చూపించడం నేరం. మానవత్వం కోసం ఆయన చేసిన పోరాటాన్ని ఇది అవమానించడమే. ఇది అంబేద్కరిజంపై జరిగిన దాడి’’ అని నెటిజెన్ అనగా.. ‘‘మహాత్మ గాంధీ చిత్రం కూడా ఉంది. కానీ మనందరికి తెలిసిన గాంధే. ఎందుకంటే సూటులో ఉన్న గాంధీ మనకు పరిచయమే. తొలినాళ్లలో అలాగే ఉండేవారు. కానీ అంబేద్కర్ విషయంలో అలా కాదు. ఇది ఉద్దేపూర్వకమైన కుట్ర అని నేను నమ్ముతున్నాను’’ అని మరొక నెటిజెన్ అన్నారు.
Pritam Lodhi: బ్రాహ్మణులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఓబీసీ లీడర్‌ను తొలగించిన బీజేపీ