Pritam Lodhi: బ్రాహ్మణులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఓబీసీ లీడర్‭ను తొలగించిన బీజేపీ

మన లోధి సమాజంలో ఎవరికైనా మంచి పంట పండితే ఏదైనా పూజ చేయాలని బ్రాహ్మణువు వస్తాడు. దానధర్మాలు చేస్తే భగవంతుడు అనుగ్రహం ప్రసాదిస్తాడని చెప్పి తొమ్మిది రోజుల పాటు రోజుకు 7-8 గంటల పాటు పిచ్చివాడిని చేస్తాడు. మీ దగ్గర నుంచి నెయ్యి, పంచదార, గోధుమలు, బియ్యం తీసుకెళ్తాడు. మహిళలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి బదులు ఇవన్నీ బ్రాహ్మణులకు ఇస్తారు.

Pritam Lodhi: బ్రాహ్మణులపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు ఓబీసీ లీడర్‭ను తొలగించిన బీజేపీ

BJP expells OBC leader for anti Brahmin remarks in Madhya Pradesh

Pritam Lodhi: రెండు రోజుల క్రితం జరిగిన ఒక కార్యక్రమంలో బ్రాహ్మణులను ఉద్దేశించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన ఓబీసీ లీడర్‭ను పార్టీ నుంచి తొలగించారు. మధ్యప్రదేశ్‭కు చెందిన ప్రితం లోధి అనే నాయకుడికి ఎదురైన చేదు అనుభవం ఇది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతికి బంధువు అయిన లోధి నుంచి మొదట లిఖిత పూర్వక క్షమాపణ తీసుకున్నారు. అనంతరం పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు రాష్ట్ర బీజేపీ అధినేత వీడీ శర్మ శుక్రవారం ప్రకటించారు.

రాష్ట్రంలోని శివపురి జిల్లాకు చెందిన లోధి.. పిచ్చోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. లోధి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి అక్క కూతురిని పెళ్లి చేసుకోవడంతో రాష్ట్ర బీజేపీలో ప్రాధాన్యం సంపాదించుకున్నారు. కాగా, బుధవారం శివపురిలో నిర్వహించిన రాణి అవంతి బాయి లోధి 191 జయంతి ఉత్సవాల్లో లోధి పాల్గొన్న లోధి బ్రాహ్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్నారు..

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘మన లోధి సమాజంలో ఎవరికైనా మంచి పంట పండితే ఏదైనా పూజ చేయాలని బ్రాహ్మణువు వస్తాడు. దానధర్మాలు చేస్తే భగవంతుడు అనుగ్రహం ప్రసాదిస్తాడని చెప్పి తొమ్మిది రోజుల పాటు రోజుకు 7-8 గంటల పాటు పిచ్చివాడిని చేస్తాడు. మీ దగ్గర నుంచి నెయ్యి, పంచదార, గోధుమలు, బియ్యం తీసుకెళ్తాడు. మహిళలు తమ పిల్లలకు ఆహారం ఇవ్వడానికి బదులు ఇవన్నీ బ్రాహ్మణులకు ఇస్తారు. ఇలా ఊరందరి నుంచి 9 రోజుల పాటు తీసుకుంటాడు. ఇంత తీసుకున్నా మన మీద కాస్తైనా కరుణ ఉండదు. ఊరికే కోపగించుకుంటాడు. గుడ్లగూబలాగ చూస్తూ మన వద్ద నుంచే 25 నుంచి 50 వేల రూపాయలు తీసుకుని వెళ్తాడు’’ అని అన్నారు.

కాగా, లోధి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లవెత్తాయి. ఆయనపై ఐపీసీ 153ఏ, 505 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం లోధి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్రాహ్మణ వర్గానికి క్షమాపణ చెప్పాల్సిందిగా లోధిని ఆదేశించగా.. పార్టీ ఆదేశానుసారం రాతపూర్వకంగా క్షమాపణ చెప్పారు. అనంతరం లోధిని పార్టీ నుంచి శుక్రవారం సస్పెండ్ చేయడం గమనార్హం.

Kurukshtera: కెనడా వీసా కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. విచిత్రంగా అదే రోజు ఇంటికి చేరిన వీసా