Kurukshtera: కెనడా వీసా కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. విచిత్రంగా అదే రోజు ఇంటికి చేరిన వీసా

రెండు రోజులుగా మిస్సైన సైని.. శుక్రవారం కురుక్షేత్రలోని కెనాల్‭లో విగత జీవై కనిపించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సైనికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరిణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సైనిని కెనడా పంపించి మంచి జీవితం అందించాలని కుటుంబం కూడా కలలు కన్నది. తన స్నేహితుడికి కెనడా వీసా వచ్చింది. తనకు రాలేదంటూ రోజూ బాధపడేవాడని, తీరా వీసా వచ్చాక దాన్ని చూడకుండానే తనువు చాలించాడని కుటుంబం కన్నీరుమున్నీరైంది.

Kurukshtera: కెనడా వీసా కోసం ఆత్మహత్య చేసుకున్న యువకుడు.. విచిత్రంగా అదే రోజు ఇంటికి చేరిన వీసా

Student suicide over canada visa when it arrived home

Kurukshtera: బాగా చదువుకుని విదేశాలకు వెళ్లి మంచి జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అయిపోవాలని చాలా మందికి ఉంటుంది. పుట్టి పెరిగిన పరిస్థితుల్ని బట్టి కొందరికి హై స్కూల్ స్థాయి నుంచే ఈ ఆలోచనలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే తమ చదువును ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. అయితే ఏదైనా సమస్య వల్ల వారి విదేశీ ప్రయాణం ఆగిపోతుందని తెలిస్తే తట్టుకోలేరు. కొందరైతే ప్రాణాల మీదకు తెచ్చుకునే వరకూ వెళ్తారు. తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది హర్యానాలో.

23 ఏళ్ల ఒక యువకుడు కెనడా వెళ్లి సెటిల్ అవ్వాలని కలలు కన్నాడు. అందుకు అనుగుణంగానే ఇండియాలో తన చదవును పూర్తి చేసుకుని, పై చదువుల నిమిత్తం కెనడా వీసాకు అప్లై చేసుకున్నాడు. అయితే కెనడా నుంచి రావాల్సిన వీసాపై ఎలాంటి సమాచారం లేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. విచిత్రంగా అతడు ఆత్మహత్య చేసుకున్న రోజునే వీసా ఇంటికి చేరింది. కొడుకు వస్తే వీసా చూపించి సర్‭ప్రైజ్ చేద్దామని అనుకున్న తల్లిదండ్రులకు ఆ మరుసటి రోజే శవమై కనిపించి శోక సంద్రాన్ని కళ్లల్లో నింపాడు.

మృతుడి పేరు వికేశ్ సైని. హర్యానాలోని షాబాద్ సబ్ డివిజన్‭లో ఉన్న గోర్ఖా గ్రామానికి చెందిన వ్యక్తి. రెండు రోజులుగా మిస్సైన సైని.. శుక్రవారం కురుక్షేత్రలోని కెనాల్‭లో విగత జీవై కనిపించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సైనికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరిణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సైనిని కెనడా పంపించి మంచి జీవితం అందించాలని కుటుంబం కూడా కలలు కన్నది. తన స్నేహితుడికి కెనడా వీసా వచ్చింది. తనకు రాలేదంటూ రోజూ బాధపడేవాడని, తీరా వీసా వచ్చాక దాన్ని చూడకుండానే తనువు చాలించాడని కుటుంబం కన్నీరుమున్నీరైంది.

కొవిడ్ కారణంగా కెనడా వీసాలు ఆలస్యమవుతున్నాయనే విషయం చాలాసార్లు వార్తల ద్వారా వచ్చింది. వీసా జారీకి కనీసం ఆరు నెలల సమయం తీసుకుంటున్నట్లు అక్కడి అధికారులే స్వయంగా ప్రకటిస్తున్నారు. ఒక్క కెనడానే కాకుండా.. ప్రపం దేశాల్లో ఈ సమస్య ఉంది. ఇంగ్లాండ్, అమెరికా దేశాలు అయితే మరింత ఆలస్యం అవుతున్నాయి. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, జర్మని, న్యూజీలాండ్, పొలండ్, బ్రిటన్, అమెరికా వంటి దేశాల వీసాలు ఆలస్యం అవుతున్నాయని కొద్ది రోజుల క్రితం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

DK and Kumaraswamy: ఆయన సీఎం అయితే ఓకే: మనసులో మాట చెప్పిన మాజీ సీఎం