DK and Kumaraswamy: ఆయన సీఎం అయితే ఓకే: మనసులో మాట చెప్పిన మాజీ సీఎం

కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించిన నేతలంతా సిద్ధరామయ్య వర్గీయులని, దీని వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన సమయంలో వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చాలా ప్రయత్నించారు.

DK and Kumaraswamy: ఆయన సీఎం అయితే ఓకే: మనసులో మాట చెప్పిన మాజీ సీఎం

If dk shivakumar become cm iam not gelicious says kumaraswamy

DK and Kumaraswamy: మామూలుగా పార్టీలోని వ్యక్తే పదవికి పోటీకి వస్తే తట్టుకోలేరు. ఇక వైరి పార్టీ నేతలపై ఉండే అభిప్రాయాలేంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్లు గెలిచిన నాటి నుంచి వాస్తవ-అవాస్తవాలతో సంబంధం లేకుండా విమర్శలు గుప్పిస్తూ దుమ్మెత్తిపోస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తుంటారు. వ్యక్తిగతంగా ఎలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఈ వైరం తప్పనిసరి కాబోలు. అయితే వైరి పార్టీ నేత ఒకరు ముఖ్యమంత్రి అయితే తానేమాత్రం అసూయ పడబోనని ముఖ్యమంత్రి పోటీదారు అయిన మాజీ ముఖ్యమంత్రి అనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

అవును.. కర్ణాటక కాంగ్రెస్ అధినేత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయితే తనకెలాంటి అభ్యంతరం లేదని, ఎలాంటి అసూయ ఉండదని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. వీరిద్దిరూ గురువారం చిత్రదుర్గ జిల్లా హిరియూరులో నిర్వహించిన నాడప్రభు కెంపేగౌడ జయంతి, ఒక్కలిగల జాగృతి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంలోనే ఇరువురు మాట్లాడుతూ ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకున్నారు.

‘‘డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అయితే ఎట్టి పరిస్థితిలోను అసూయ పడేది లేదు. కానీ కాంగ్రెస్‌లోనే బీసీ వర్గానికి చెందిన ప్రముఖ నేత ఒకరు కుర్చీ కోసం టవల్‌ వేశారు (సిద్దరామయ్య పేరు చెప్పకుండా). సీఎం హోదా కోసం డీకే శివకుమార్‌ పోటీ చేయని పక్షంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన నేను సైతం ఆ పదవికి తీవ్రంగానే ప్రయత్నిస్తాను. అధికారం ఎవరికైనా దక్కవచ్చు. దానికి భగవంతుడి ఆశీస్సులు ఉండాలి’’ అని కుమారస్వామి అన్నారు.

ఇక డీకే మాట్లాడుతూ కుమారస్వామి రెండో సారి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో తన ఉత్సాహం వర్ణించలేనిదని అన్నారు. ఇదే సందర్భంలో నంజావదూత స్వామీజీ మాట్లాడుతూ డీకే శివకుమార్‌, కుమారస్వామిలలో ఎవరు సీఎం అయినా సంతోషమేనని, ఇరువురిలో ఒకరు ముఖ్యమంత్రి తప్పనిసరిగా అవుతారని అన్నారు. వైరి పక్షాలకు చెందిన ఇరువురు నేతలు పరోక్షంగా సమర్థించుకునేలా వ్యాఖ్యానించడం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమవుతోంది.

కాంగ్రెస్, జేడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి బీజేపీలో చేరారు. దీంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. ఫిరాయించిన నేతలంతా సిద్ధరామయ్య వర్గీయులని, దీని వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆ మధ్య బాగానే ప్రచారం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎదురు తిరిగిన సమయంలో వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చి ప్రభుత్వాన్ని నిలబెట్టేందుకు చాలా ప్రయత్నించారు. ఒకానొక సమయంలో ముంబైలో వారున్న రిసార్ట్ బయట బైటాయించి ధర్నాకు సైతం దిగారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య మంచి సత్సంబంధాలు పెరిగాయి.

Revanth Reddy: తెలంగాణ ఆకాంక్షలను గుర్తించింది కాంగ్రెస్సే: రేవంత్ రెడ్డి