Drugs Seized (1)
Drugs Seized In Assam : అస్సాంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. గువాహటిలోని కటాహ్ బారీ ప్రాంతంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. మత్తుమందు సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.
నిందితుల నుంచి రూ.7.25 కోట్ల విలువైన 29 వేల యాబా ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముజక్కిర్ హుస్పెయిన్, సైఫుల్ ఇస్లాంగా గుర్తించారు. కాగా, నవంబర్ 18న కరీంగంజ్ లో రూ.50 లక్షల విలువైన మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు.
సర్గోల ప్రాంతంలో ఆటోలో తరలిస్తున్న 1060 కిలోల బరువు ఉన్న 96 వేల యాబా ట్యాబ్లెట్లను గుర్తించారు. దీంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు.