షిరిడీలో SpiceJet కు తప్పిన పెను ప్రమాదం

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు పెను ప్రమాదం తప్పింది.

  • Published By: sreehari ,Published On : April 29, 2019 / 12:09 PM IST
షిరిడీలో SpiceJet కు తప్పిన పెను ప్రమాదం

Updated On : April 29, 2019 / 12:09 PM IST

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు పెను ప్రమాదం తప్పింది.

ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ కు పెను ప్రమాదం తప్పింది. మహారాష్ట్రలోని షిర్డీ విమానశ్రయంలో సోమవారం (ఏప్రిల్ 29, 2019) మధ్యాహ్నం సమయంలో జెట్ విమానం ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. స్పైస్ జెట్ బీ737-800 ఆపరేటింగ్ విమానం ఎస్ జీ 946 ఢిల్లీ నుంచి షిరిడీకి చేరుకుంది. ల్యాండింగ్ అవుతున్న సమయంలో 30-40 మీటర్ల ఎత్తులో రన్ వే పై టచ్ కాగానే. కాస్త కుదుపునకు గురైంది. దీంతో విమానం రన్ వే జారి కొంతదూరం దూసుకెళ్లింది.

ఈ ఘటనలో విమానంలోని ప్రయాణకులంతా భయభ్రాంతులకు గురయ్యారు. అదృష్టవశాత్తూ జెట్ విమానంలో ప్రయాణికులు, జెట్ సిబ్బంది ఎవరికి ఎలాంటి గాయాలు లేదు. నార్మల్ ప్రక్రియ ప్రకారమే విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపేశారు. ఈ ఘటనతో విమానశ్రయంలోని సర్వీసులకు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.