SSC New Reforms 2025
SSC New Reforms 2025: స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల ప్రక్రియలో పారదర్శకత, న్యాయబద్ధత, జవాబుదారీతనాన్ని మరింత పెంచే లక్ష్యంతో కొత్త సంస్కరణలను తీసుకొచ్చింది. 2025 అక్టోబర్ నుంచి 2026 మార్చి మధ్య రాబోయే పరీక్షల్లో ఈ సంస్కరణలను అమలు చేస్తామని అధికారులు తెలిపారు.
SSC సంస్కరణలు..
♦ పరీక్ష అనంతరం అభ్యర్థులు తమ ప్రశ్న, జవాబు పత్రాలు చూసుకునే అవకాశంను ఎస్ఎస్‌సీ కల్పించింది.
♦ ఇకపై, అభ్యర్థులు పరీక్ష రాసిన వెంటనే తమకు వచ్చిన ప్రశ్నపత్రం, దానికి తామిచ్చిన సమాధానాలతో పాటు కీని కూడా చూసుకోవచ్చు. వాటిని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. వాటి ఆధారంగా అభ్యర్థులు ఏదైనా ప్రశ్నపై బోర్డును సవాల్ చేయొచ్చు.
♦ ఏదైనా పరీక్ష వేర్వేరు షిప్టుల్లో జరుగుతుంటే మాత్రం ఆ పరీక్షలన్నీ పూర్తయిన తరువాతే ప్రశ్నపత్రాలు, సమాధానాలు కనిపిస్తాయని, ఆ తరువాతే సవాల్ చేసుకోవాల్సి ఉంటుందని ఎస్ఎస్‌సీ వివరించింది.
♦ ఇకపై మార్కుల ఆధారంగా కాకుండా పర్సంటైల్ విధానంలో అభ్యర్థుల మెరిట్ జాబితాను నిర్ణయించనుంది.
♦ ప్రశ్నాపత్రం లీకేజీలు నిరోధానికి డిజిటల్ వాల్డ్ ల వినియోగించనుంది.
♦ పరీక్ష కేంద్రాల్లో ఆధార్ గుర్తింపు ఆధారంగా అభ్యర్థుల హాజరు తీసుకోనుంది.
♦ ఓ ప్రశ్నను సవాలు చేసేందుకు రుసుమును ఎస్ఎస్‌సీ తగ్గింది. గతంలో రూ. 100గా ఉన్న రుసుము.. ప్రస్తుతం రూ.50కు తగ్గించింది.
♦ ఎంపిక చేసిన పలు పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ఇక నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంచుతామని ఎస్ఎస్సీ ప్రకటించింది. దీని ద్వారా పరీక్షల సిలబస్, మోడల్ ప్రశ్నపత్రం తదితర అంశాలపై అభ్యర్థులకు స్పష్టమైన అవగాహన ఏర్పడుతుందని తెలిపింది.
♦ ఇప్పటికే ఉన్న టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ (1800-309-3063) తో పాటు, అభ్యర్థుల సమస్యల త్వరిత పరిష్కారం కోసం ఆన్‌లైన్ ఫీడ్‌బ్యాక్, ఫిర్యాదుల పోర్టల్ ప్రారంభించింది.
వాళ్లకు మళ్లీ పరీక్ష ..
ఎస్ఎస్సీ ఇటీవల నిర్వహించిన సీజీఎల్ఈ-2025 (కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్) పరీక్షకు 125 నగరాల్లోని 255 కేంద్రాల్లో 13.5లక్షల మంది హాజరయ్యారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ఇందులో కొన్ని పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సమస్యలు తలెత్తిన కేంద్రాల్లో పరీక్షలు రాసిన వారికి అక్టోబర్ 14వ తేదీన మళ్లీ పరీక్షను నిర్వహించేందుకు ఎస్ఎస్‌సీ సిద్ధమైంది. అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తామని తెలిపారు.
రాబోయే పరీక్షల షెడ్యూల్..
అక్టోబర్ 2025 నుంచి మార్చి 2026 మధ్య ఎస్ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ (CHSLE), మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), జూనియర్ ఇంజనీర్ (JE), కానిస్టేబుల్ (ఢిల్లీ పోలీస్ & సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్), సబ్-ఇన్‌స్పెక్టర్ (ఢిల్లీ పోలీస్ & CAPFలు), మరియు ఢిల్లీ పోలీసుల సాంకేతిక కేడర్ పరీక్షలతో సహా అనేక ప్రధాన పరీక్షలను నిర్వహిస్తుంది.