విద్యార్థులకు శుభవార్త.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో అడ్మీషన్లు షురూ.. ఆ క్లాసులు వారికి మాత్రమే.. పూర్తి వివరాలు ఇవే..
Young India Police School : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికిగాను..

Young India Police School
Young India Police School : చదువుతోపాటు క్రీడలు, విలువలకు ప్రాధాన్యంత ఇస్తూ.. నాయకత్వ నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు అత్యున్నత విద్యాబోధన చేసేలా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ (Young India Police School) ను ప్రారంభించింది. అయితే, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో 2026-27 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు డీజీపీ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ లో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. 2026-27 విద్యా సంవత్సరానికిగాను 1వ తరగతి నుంచి 6వ తరగతుల్లో అడ్మిషన్ల కోసం ఆసక్తిగల తల్లిదండ్రులు yipschool.in వెబ్‌సైట్ లేదా 9059196161 నంబర్ ను సంప్రదించవచ్చునని తెలిపారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో 50శాతం సీట్లు పోలీస్ సిబ్బందికి కేటాయించగా.. మిగిలిన 50శాతం సీట్లను సాధారణ ప్రజల పిల్లలతో భర్తీ చేయనున్నట్లు డీజీపీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ స్కూల్లో విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా అకడమిక్, స్పోర్ట్స్, కోకరిక్యులర్ కార్యక్రమాలు సమన్వయంతో కొనసాగుతున్నాయని తెలిపారు. క్రమశిక్షణ, విలువలపై దృష్టి పెట్టడంతో పాటు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. yipschool.in వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని ఆయా నిబంధనలకు అనుగుణంగా అడ్మిషన్లు పొందవచ్చునని డీజీపీ కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది.
చదువుతో పాటూ క్రీడలు, ఉన్నత విలువలతో పాటు నైపుణ్యత, వ్యక్తిత్వ వికాసంతో పాటు అత్యుత్తమ బోధన.. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో గ్రేడ్ 1-6 కొరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో కలవు..
మరిన్ని వివరాల కోసం https://t.co/cQWVW5UK1u లో సంప్రదించండి. pic.twitter.com/qOnuYMFR7J— Telangana Police (@TelanganaCOPs) October 3, 2025