Stone Floating In Ganga River: గంగానదిలో తేలుతూ వచ్చిన రాయి.. ఆ రాయిపై ఏమని రాసిఉందంటే? చూసేందుకు భారీగా తరలివస్తున్న ప్రజలు

బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాయి గంగానదిలో తేలుకుంటూ వెళ్లడం కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి రాయిని ఒడ్డుకు చేర్చారు.

Ram Setu Stone

Ganga River: హిందూ పురాణ కథల ప్రకారం.. శ్రీరామ చంద్రుడు సతీమణి సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్లి లంకలో బందిస్తాడు. దీంతో రాములవారు సీతమ్మకోసం లంకకు బయలుదేరుతారు. ఈ క్రమంలో రామేశ్వరం వద్ద సముద్రంపై వారధి నిర్మించే సమయంలో రాళ్లు నీటిలో మునిగిపోయేవట. ఈ క్రమంలో రాముడి వెంట ఉన్న వానరసైన్యం బండరాళ్లపై శ్రీరామ అని రాసి సముద్రంలో వేయడం ద్వారా అవి తేలి వారధి ఏర్పడుతుంది. దానినే రామసేతు అంటారు. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం వర్ణణ ఉంటుంది. 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్నిరాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు. అప్పటి నుంచి నీటిలో తేలే రాళ్లు కనిపిస్తే భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.

Ram Setu Stone

Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. వేగంగా కదిలితే ఏమవుతుందో తెలుసా?

తాజాగా బీహార్ రాష్ట్రంలో పాట్నాలోని గంగా నదిలో దొరికిన రాయి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ రాయి గంగానదిలో తేలుకుంటూ వెళ్లడం కనిపించింది. దీంతో ఇద్దరు యువకులు ఈదుకుంటూ వెళ్లి రాయిని ఒడ్డుకు చేర్చారు. ఈ రాయిపై శ్రీరామ్ అని ఉండటంతో స్థానిక ప్రజలు రాయిని చూసేందుకు భారీగా తరలివచ్చారు. రాయికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాజ్‌ఘాట్ సమీపంలోని ఓ ఆలయంలోని టబ్‌లో ఉంచి స్థానికులు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ రాయిని చూసేందుకు భారీ సంఖ్యలో చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు.

Ram Setu Stone

Ramasethu : రామసేతుపై మళ్లీ మొదలైన పరిశోధనలు..శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు?

రాయిపై శ్రీరామ్ అని రాసిఉండటంతో ఇది రామసేతులోని రాయేనని స్థానిక ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త, ఈ రాయికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రాయి దొరికిన రాజ్‌ఘాట్ పేరును రామ్‌ఘాట్‌గా మార్చాలని కూడా కొందరు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అది రామసేతులోని రాయేనని, ఈరాయిపై పరిశోధన జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలాఉంటే, ఈ రాయిని నదిలో నుంచి బయటకు తీసినప్పుడు తూకం వేస్తే తొమ్మిది కిలోలు ఉండగా.. కొద్ది గంటల తరువాత దాని బరువు 17 కిలోలకు పెరిగినట్లు స్థానికులు తెలిపారు.