Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. వేగంగా కదిలితే ఏమవుతుందో తెలుసా?

చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Chandrayaan-3: చంద్రుడి ఉపరితలంపై నెమ్మదిగా కదులుతున్న ప్రజ్ఞాన్ రోవర్.. వేగంగా కదిలితే ఏమవుతుందో తెలుసా?

Chandrayaan-3

Chandrayaan-3 Mission: చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో (ISRO) ప్రయోగించిన చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతం అయిన విషయం తెలిసిందే. ల్యాండర్ విక్రమ్ విజయవంతంగా ల్యాండింగ్ అయింది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రునిపై నడుస్తూ డేటాను సేకరిస్తోంది. రోవర్ ప్రతి కదలికపై ఇస్రో ఓ కన్నేసి ఉంచుతోంది. వచ్చే రెండు వారాలపాటు ఈ ప్రక్రియను తమ బృందం పర్యవేక్షిస్తుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ల్యాండర్, రోవర్ అన్నీ పనిచేస్తున్నాయి. అంతా సక్రమంగా జరుగుతుందని, రాబోయే 14 రోజులు మేము డేటాను అధ్యయనం చేస్తూనే ఉంటామని ఇస్రో చీఫ్ తెలిపారు.

Pragyan Rover

Pragyan Rover

Chandrayaan-3: చంద్రయాన్ -3 మూడు లక్ష్యాల్లో రెండింటిని పూర్తిచేసిందట.. అవేమిటి? ఇస్రో శాస్త్రవేత్తలు ఏమన్నారంటే

ఆరు చక్రాలకు ఆరు మోటార్లు..

ప్రజ్ఞాన్ రోవర్ ఒక పెద్ద సూట్‌కేస్ పరిమాణంలో ఉంటుంది. దీని పొడవు మూడు అడుగులు, వెడల్పు 2.5 అడుగులు. రోవర్‌కు ఒకవైపు 36 అంగుళాల పొడవైన సౌరఫలకం ఉంటుంది. దీనిద్వారా 50వాట్ల శక్తి ఉత్పత్తవుతుంది. చంద్రుడి ఉపరితలంపై ప్రయాణానికి అనువుగా ప్రజ్ఞాన్‌కు ఆరు చక్రాలను ఏర్పాటు చేశారు. చిన్నపాటి రాళ్లు అధిగమించడానికి మొదట ఒకచక్రం ఆ రాయిపైకి వెళ్తుంది. మిగతా చక్రాలు రోవర్‌ను స్థిరంగా ఉంచుతాయి. ఈలోగా మొదటి చక్రం రాయిని దాటేస్తుంది. ఈ క్రమంలో రోవర్ ముందుకు కదులుతుంది. తర్వాత రెండో చక్రం రాయిపైకి చేరుతుంది. ప్రజ్ఞాన్‌కు అమర్చిన ఆరు చక్రాలకు వేరువేరుగా మోటార్లు కలిగి ఉండటం వల్ల వేటికవే విడిగా పనిచేయగలుగుతాయి. అవసరాన్ని బట్టి మిగతా చక్రాలతో సంబంధం లేకుండా వాటిని ఎటువైపైనా తిప్పొచ్చు.

Chandrayaan-3 Mission

Chandrayaan-3 Mission

Aditya-L1 Mission : ఇస్రో మరో కీలక ప్రయోగం.. సూర్యుడి రహస్యాలు కనుగొనేందుకు సిద్ధం, ఆదిత్య – ఎల్1 ప్రయోగం

రోవర్ నెమ్మదిగా ఎందుకు కదులుతుంది..?

ప్రజ్ఞాన్ రోవర్ ముందు భాగంలో రెండు నావిగేషన్ కెమెరాలు ఉన్నాయి. ఇవి నేత్రాల్లా పనిచేస్తాయి. అయితే, చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి ఉపరితలంపై నున్నటి ధూళి ఉంటుంది. రోవర్ చక్రాల కదలిక వేగంగా ఉంటే ఈ ధూళి పైకి ఎగిసే అవకాశం ఉంది. చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. దీనికారణంగా రోవర్ వేగంగా కదిలి దుమ్ము పైకిలేస్తే తొందరగా సర్దుమణగదు. కొద్దిపాటి దుమ్ముపైకి లేసినా అది రోవర్ పరికరాలు, కెమెరాలను కప్పేసే ప్రమాదం ఉంది. ఫలితంగా ప్రజ్ఞాన్ రోవర్ భూమికి సరియైన సమాచారాన్ని పంపించే అవకాశం కోల్పోతుంది. దీనికారణంగా చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ అతి నెమ్మదిగా అంటే సెంటీమీటర్ వేగంతో కదులుతుంది.