Karthika Masam: కష్టాలు, బాధలను దూరం చేసి ధన లాభం కలిగించే దీపం ఇదే..!
ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి పోయాలి. ఆ తర్వాత ప్రతి పిండి దీపంలో కూడా రెండు పువ్వొత్తులు అంటే రెండు కుంభ వత్తులు వేసి దీపాలు వెలిగించాలి.
Karthika Masam: కార్తిక మాసంలో కలియుగంలో వచ్చే అన్ని రకాల కష్టాలు, బాధలు, సమస్యలు వీటన్నింటి నుంచి బయటపడేందుకు వేంకటేశ్వర శంఖు చక్ర దీపాలు ఏ విధంగా వెలిగించాలో తెలుసుకుందాం.
కార్తిక మాసంలో వచ్చే శనివారాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామి దగ్గర వేంకటేశ్వర శంఖు చక్ర దీపాలు వెలిగించడం ద్వారా కలియుగంలో వచ్చేటటువంటి అన్ని రకాలైన కష్టాలు, బాధలు, సమస్యలు అన్నింటి నుంచి బయట పడొచ్చు. ఈ వేంకటేశ్వర శంఖు చక్ర దీపాలు ఎలా వెలిగించాలటే.. కార్తిక మాసంలో వచ్చే శనివారం ఇంట్లో పూజ గదిలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత వేంకటేశ్వ స్వామి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి. ఆ చిత్ర పటానికి తులసి మాలికను అలంకారం చేయాలి. సువాసన కలిగిన పుష్పాలను ఆ చిత్రపటం దగ్గర ఉంచండి.
ఇప్పుడు వేంకటేశ్వ స్వామి వారి చిత్రపటం దగ్గర రాగి లేదా ఇత్తడి ప్రమిద ఇరువైపుల ఉంచాలి. అంటే రెండు రాగి ప్రమిదలు, లేదా ఇత్తడి ప్రమిదలు స్వామి వారి చిత్రపటానికి రెండు వైపులా ఉంచాలి. వాటిలో పిండి దీపాలు ఉంచాలి. లేదా చలిమిడి దీపాలు ఉంచాలి. అంటే బియ్యం పిండి, బెల్లం తురుము, ఆవు పాలతో తయారు చేసిన పిండి దీపం.
చలిమిడి దీపం రాగి ప్రతిమల్లో రెండు వైపులా ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రమిదల్లో ఆవు నెయ్యి పోయాలి. ఆ తర్వాత ప్రతి పిండి దీపంలో కూడా రెండు పువ్వొత్తులు అంటే రెండు కుంభ వత్తులు వేసి దీపాలు వెలిగించాలి. అలా వెలిగించిన తర్వాత పిండి దీపాల దగ్గర ఏదైనా లోహంతో చేసిన చిన్న శంఖువు, చిన్న చక్రాన్ని ఆ పిండి దీపాల దగ్గర ఉంచాలి. వీటినే వేంకటేశ్వర శంఖు చక్రదీపాలు అనే పేరుతో పిలిస్తారు. కార్తిక మాసంలో వచ్చే అన్ని శనివారాలు లేదా ఏదైనా శనివారం రోజున వెలిగిస్తే కలియుగంలో వచ్చే అన్ని రకాల బాధలు, సమస్యలు, కష్టాల నుంచి సులభంగా బయటపడొచ్చు.
