Home » Chandrayaan-3 Mission
సెప్టెంబర్ 22న చంద్రుడిపై రాత్రి (లూనార్ నైట్) పూర్తయింది. ల్యాండర్, రోవర్ ఉన్న జాబిల్లి దక్షిణ ధ్రువం వద్ద తిరిగి సూర్యోదయం అయింది. ఈ నేపథ్యంలో వాటితో కమ్యూనికేషన్ ను పునరుద్ధరించేందుకు ఇస్రో చర్యలు చేపట్టింది. ఇస్రో ప్రయత్నాలు విఫలమవుతూ వచ�
ల్యాండర్, రోవర్ తిరిగి యాక్టివ్ అయ్యాయా? అన్న విషయంపై ఇస్రో ఇవాళ సాయంత్రం స్పందించింది.
ఇస్రో ట్వీట్ ప్రకారం.. బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ ను రోవర్ ఫొటో తీసింది. రోవర్ కు అమర్చిన నావిగేషన్ కెమెరాలు ఈ ఫొటోలు తీశాయి.
చంద్రుడి ఉపరితలంపై రోవర్ నెమ్మదిగా కదులుతుంది. దీనికి ప్రధాన కారణం ఉంది. రోవర్ సెంటీమీటరు వేగంతో కదలడానికి చంద్రుడి ఉపరితలంపై పరిస్థితులే కారణమని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రుడి ఉపరితలంపై ప్రజ్ఞాన్ రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో విడుదల చేసింది. విక్రమ్ ల్యాండర్ నుంచి ర్యాంప్ తెరుచుకుని అందులో నుంచి చంద్రుడి ఉపరితలంపైకి రోవర్ చేరుకోవడం వీడియో కనిపిస్తుంది.
ఇస్రో తాజాగా ట్విటర్లో షేర్ చేసిన వీడియోకు .. ’చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్-3 ల్యాండర్ నుంచి రోవర్ కిందికి ఇలా దిగింది’ అని ఇస్రో క్యాప్షన్ ఇచ్చింది.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవెల్లి గ్రామానికి చెందిన కృష్ణ అనే యువకుడు కూడా చంద్రయాన్- 3 మిషన్ కోసం సేవలందించాడు.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్ -3 మరికొద్ది గంటల్లో జాబిల్లి దక్షిణ ఉపరితలంపై అడుగుపెట్టనుంది. అయితే, జాబిల్లిపై ల్యాండర్ అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను ప్రతీఒక్కరూ వీక్షించే అకాశాన్ని ఇస్రో కల్పించింది.
చంద్రయాన్-3 యొక్క విక్రమ్ ల్యాండర్ ఆదివారం తెల్లవారు జామున 2గంటల నుండి 3 గంటల మధ్య రెండో, చివరి డీ-బూస్టింగ్ను విజయవతంగా పూర్తిచేసింది.
చంద్రయాన్ -3 ప్రయోగంలో కీలక ఘట్టం విజయవంతం అయిందని ఇస్రో ట్విటర్ ద్వారా తెలిపింది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయిన తరువాత ‘థ్యాంక్స్ ఫర్ ది రైడ్, మేట్’ అని ల్యాండర్ మెసేజ్ పంపినట్లు ఇస్రో ట్వీట్ లో పేర్కొంది.